Rakul Preet Singh : మన ఇద్దరం కలిసి ఎన్నెన్నో చేయాలి.. మంచు లక్ష్మీ, రకుల్ ముద్దుల గోల!
Rakul Preet Singh మంచు లక్ష్మీ , రకుల్ ప్రీత్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధం మీద నెట్టింట్లో రకరకాల రూమర్లు వస్తుంటాయి. ఈ ఇద్దరూ హగ్స్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తుంటారు. ఈఇద్దరూ ఏదో తేడాగా ఉన్నారే అంటూ కామెంట్లు పెడుతుంటారు. అలా రకుల్, మంచు లక్ష్మీ ఒకే చోటకు చేరారంటే అక్కడంతా రచ్చ రచ్చే. మామూలుగా అయితే ఈ ఇద్దరూ తమ తమ బర్త్ డేలను ఒకే చోట సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు.
అయితే తాజాగా మంచు లక్ష్మీ విదేశాల్లో ఫుల్ హల్చల్ చేస్తోంది. ఆమె ఇప్పుడు స్పెయిన్‌లోఉంది. తన స్నేహితులతో కలిసి దుమ్ములేపుతోంది. కానీ రకుల్ ప్రీత్ మాత్రం ఇక్కడే ఉంది. కొండపొలం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే మంచు లక్ష్మికి తన స్టైల్లో రకుల్ బర్త్ డే విషెస్ చెప్పింది. తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటోలు, అందులో ముద్దులు పెట్టుకునేందుకు రెడీగా ఉన్న ఆ ఇద్దరినీ చూస్తే నిజంగానే ఏదో తేడా కొడుతుందే అనేట్టుగా ఉంది.
Rakul Preet Singh మంచు లక్ష్మీకి రకుల్
హ్యాపీ బర్త్ డే మై సోల్ సిస్టా.. నీలాంటి వాళ్లు ఇంకెవ్వరూ ఉండరు.. నున్ నా జీవితంలోకి వచ్చినందుకు నేను లక్కీ. నిన్ను ఆకాశమంత ప్రేమిస్తున్నాను. నీకు నేను ఎప్పుడూ లెక్చర్ ఇస్తూనే ఉంటానని తెలుసు. మనం ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయ్. ఫుడ్ ట్రిప్స్, వెకేషన్స్, షాపింగ్ ఎందుకంటే మనిద్దరం క్రేజీ కాబట్టి. ఈ ఏడాది నువ్ కోరుకున్నవన్నీ జరగాలి అని కోరుకుంటున్నాను అని రకుల్ చెప్పుకొచ్చింది.