Ram Charan Fans : రామ్ చరణ్ చేసిన తప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకి శిరీష్ సమాధానం చెబుతారా?
ప్రధానాంశాలు:
Ram Charan Fans : రామ్ చరణ్ చేసిన తప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకి దిల్ రాజు, శిరీష్ సమాధానం చెబుతారా?
Ram Charan Fans : ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా, ఆయన ఎస్‌వీసీ బ్యానర్‌లోనే సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయం మెగా ఫ్యాన్స్‌లో పెద్ద చర్చకి దారి తీసింది.ఆర్.ఆర్.ఆర్’ తరవాత.. ఎంత మంది నిర్మాతలొచ్చినా ఎస్‌వీసీ బ్యానర్‌కు సినిమా చేయడమే రామ్ చరణ్ తప్పా అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Ram Charan Fans : రామ్ చరణ్ చేసిన తప్పేంటి.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకి శిరీష్ సమాధానం చెబుతారా?
Ram Charan Fans : చరణ్ చేసిన తప్పు ఇదేనా ?
పారితోషికాన్ని కూడా పక్కన పెట్టి 33 శాతం వాటా తీసుకోవడమే రామ్ చరణ్ చేసిన తప్పా? ఆయనకి పారితోషికం కింద వంద కోట్లు వస్తాయని చెబితే , అది నమ్మి 60 కోట్లకు పరిమితం అవ్వడం ఆయన చేసిన తప్పా? ‘భారతీయుడు 2’ షూటింగ్ చేసుకొస్తానని శంకర్ అడిగితే ‘ఓకే’ అని సర్దుకోవడం చరణ్ చేసిన తప్పా? మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా మరో సినిమా చేయకపోవడం కూడా రామ్ చరణ్ చేసిన తప్పేనా?
తన సినిమాతో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానీ విడుదల చేస్తామంటే ‘నో’ చెప్పకపోవడం రామ్ చరణ్ చేసిన తప్పా? అని సగటు మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న ప్రశ్నలు. వీటికి దిల్ రాజు, శిరీష్ స్పందింస్తారా అని అడుగుతున్నారు. ఈ అంశాలపై దిల్ రాజు లేదా శిరీష్ వారి అభిప్రాయాలు పంచుకోవాలని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వారి నుండి ఎలాంటి స్పష్టత రానంత కాలం, ఫ్యాన్స్‌లో ఇంకా అనేక సందేహాలు వస్తూనే ఉంటాయి.