Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడం ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోవడంతో ఫ్యాన్స్ మేకర్స్ ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినాయకచవితి సందర్బంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడం ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోవడంతో ఫ్యాన్స్ మేకర్స్ ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినాయకచవితి సందర్బంగా సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. ఎలాంటి సాంగ్ రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసారు. ఈ మూవీ ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం డిసెంబర్ లో కష్టమే అని తెలుస్తుంది. సమ్మర్ కానుకగా మార్చి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావొచ్చు అని అంటున్నారు.

Ram Charan రామ్ చరణ్ డ్యూయెల్ రోల్..

ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.

Ram Charan గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

ఆచార్య ప్లాప్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న ఈ సినిమా పై భారీ క్రేజ్ ఉంది.. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోవడం గ్యారంటీ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది