Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసిన అందాల హీరోయిన్
Ram Gopal Varma : మహేశ్వరి..ఈ అమ్మడు కుర్రకారుకి కలల రాణిగా మారింది. ‘గులాబీ’ సినిమాతో ప్రేక్షకులందరికీ చేరువైంది నటి మహేశ్వరి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘కరుతమ్మ’ చిత్రంతో పదహారేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ‘అమ్మాయి కాపురం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘దెయ్యం’, ‘పెళ్లి’, ‘మా బాలాజీ’, ‘గులాబి’, ‘జాబిలమ్మ పెళ్లి’, ‘నీకోసం’, ‘మా అన్నయ్య’ వంటి పలు చిత్రాలతో అలరించింది మహేశ్వరి. చాలా రోజుల తర్వాత ఓ టీవీ షోలో దర్శనమిచ్చిన మహేశ్వరి ఆసక్తికర విషయాలు తెలియజేసి వార్తలలో నిలిచింది. శ్రీదేవి తనకు చిన్నమ్మ అవుతారని, కానీ తాను మాత్రం అక్క అని పిలిచేదాన్ని అని తెలిపింది.
శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చానని నాకు చాలా పొగరు అనేవాళ్లని, కానీ తనకు పొగరులాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది.ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ విషయంలో తనను చిట్ చేశారంటూ చెప్పుకొచ్చింది మహేశ్వరి. దెయ్యం సినిమా షూటింగ్ మేడ్చల్లోని ఓ పాడుపడ్డ ఫామ్ హౌస్లో స్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్ సుమారు 2 కిలోమీటర్లు. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంది. రాత్రి ఒంటిగంట సమయంలో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు వర్మ మీలో ఎవరైనా మెయిన్ రోడ్డు వరకు వెళ్లి వస్తే రూ. 50 వేలు ఇస్తానని పందెం కట్టారు. దీంతో భయపడుతూనే వెళ్లి వచ్చాను.

Ram Gopal Varma cheated me says maheshwari
Ram Gopal Varma : ఇస్తా అన్న డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు..
ఇప్పటివరకు నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది మహేశ్వరి. ఈ సినిమాలో మహేశ్వరితోపాటు.. జేడీ చక్రవర్తి హీరోగా నటించారు . ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది.మహేశ్వరి ప్రస్తుతం తెలుగులో సినిమాలేవి చేయడం లేదు కాని, షోలలో మాత్రం తెగ సందడి చేస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. నవీన్.. మహేశ్వరి కాంబోలో వచ్చిన పెళ్లి సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడమే కాకుండా.. మహేశ్వరి నటనకు మంచి మార్కులే పడ్డాయి.