Ram gopal varma : వర్మకి షాక్‌.. దిశ ఎన్కౌంటర్‌కి బ్రేక్..

Authored By vamana sai | The Telugu News | Updated on: June 15, 2021, 8:21 pm

Ram gopal varma : బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో వివాదాలను వెంటేసుకుంటూ సంచలన దర్శకుడుగా పేరున్న రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా ‘దిశ ఎన్కౌంటర్’. ఈ సినిమా విషయంలో వర్మకి షాక్ తగిలింది. రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ మధ్య కాలంలో వర్మ తన అసోసియేట్స్ తో సినిమాలు తీయించి ఈయన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసుకుంటున్నారు. ఓటీటీలను బాగా వాడుకుంటున్న వర్మ ఇటీవల డిజిటల్ రంగంలోకి ఎంటరైన స్పార్క్ ఓటీటీలో ఏకంగా ఓ థియేటర్స్ అద్దెకు తీసుకున్నాడు.

ఇందులో ఆయన నుంచి వచ్చే సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘దిశ ఎన్కౌంటర్’ సినిమాను రిలీజ్ చేయాలని రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. సినిమా సెన్సార్ సమయంలో బోర్డు కమిటీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటన ఆధారంగా సినిమా తీశారని.. ఆ ఘటనకు సంబంధించిన సన్నివేశాలు యదాతథంగా సినిమాలో కనిపిస్తున్నాయని సెన్సార్ కమిటీ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వలేదు.

ram gopal varma disha movie Break

ram gopal varma disha movie Break

Ram gopal varma : ‘దిశ ఎన్కౌంటర్‌’ కాదు ‘ఆశ ఎన్కౌంటర్’..!

దాంతో నిర్మాతలు రివిజన్ కమిటీని ఆశ్రయించి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ సాధించారు. 2019లో హైదరాబాద్ నగర శివారులో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠించించింది. వర్మకి ఇదే కథా వస్తువు అయింది. కానీ ఆమె తల్లి దండ్రులు దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించగానే వర్మకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఇవేవి పట్టించుకోకుండా ‘దిశ ఎన్కౌంటర్’ సినిమా తీసి టీజర్, ట్రైలర్ చేసాడు వర్మ. అప్పుడు కూడా దిశ తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపుతూ, పోలీసులను ఆశ్రయించి సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు. తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేయగా హైకోర్టు సినిమా విడుదలను 2వారాలు వాయిదా వేసింది. ఈ సినిమా టైటిల్ కూడా ‘ఆశ ఎన్కౌంటర్’ గా మార్చారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Viral Video : వామ్మో… ఈ యువ‌తి నాగుపామును చేతితో ప‌ట్టుకోని ఏం చేస్తుందో చూడండి

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam : నువ్వు మాములోడివి కాదు.. కార్తీకదీపం డాక్ట‌ర్ బాబుపై వెన్నెల కిషోర్ కామెంట్స్ వైర‌ల్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Sonu Sood : సోనూ సూద్ నువ్వు నిజంగా దేవుడివి.. ఎందుకో ఈ వీడియో చూడండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Viral Video : పెళ్లి పీటల మీదే పెళ్లి కూతురు చేసిన పనికి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు?

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp