Karthika Deepam : నువ్వు మాములోడివి కాదు.. కార్తీకదీపం డాక్టర్ బాబుపై వెన్నెల కిషోర్ కామెంట్స్ వైరల్..!
Karthika Deepam తెలుగు బుల్లితెర సీరియల్ కార్తీకదీపం Karthika Deepam నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఈ సీరియల్ కు ఎంత పాపులర్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీల మనసు కూడా దోచేసింది. అంతేకాకుండా కార్తీకదీపం టీఆర్‌పీ రేటింగ్‌లో కూడా ప్రదమ స్థానంలో ఉంది. ప్రేక్షకులు ఈ సీరియల్ చూడడానికి నిమిషం సమయం కూడా వదలడం లేదు.
ప్రస్తుతం కార్తీకదీపం Karthika Deepam సీరియల్లో దీప అమ్మ తనం అంటే ఏమిటో తెలుసుకున్న డాక్టర్ బాబు (కార్తీక్) దీపకు క్షమాపణలు చెబుతాడు. ఆ సీన్ చూసి బుల్లితెర ప్రేక్షకులు తెగ సంబరపడ్డారు. దీంతో కార్తీక దీపం సీరియల్ శుభం కార్డ్ పడుతుందని అందరు అనుకున్నారు కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ మొదలైంది. అయితే మోనిత సీన్‌లోకి ఎంటరై డాక్టర్ బాబు వల్లే నాకు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
కార్తీకదీపం మరో కొత్త ట్విస్ట్.. Karthika Deepam

vennela kishore Comments On Karthika Deepam serial
దీంతో సోషల్ మీడియాలో కార్తీకదీపం సీరియల్ పై తెగ కామెంట్స్ చేస్తున్నారు. డాక్టర్ బాబు , దీపలు ఈ జన్మలో కలవరని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇది మొత్తం మోనిత చేస్తున్న ప్లాన్ అని డాక్టర్ బాబు ను లొంగదీసుకోవాలని అంటున్నారు. ఈ ఎపిసోడ్ సంబందించిన విషయంపై సెలబ్రిటీలు కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అందులో బాగంగా కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కార్తీక దీపం సీరియల్ పై కామెంట్ చేశారు. ఎంత పని చేశావు డాక్టర్ బాబు అంటు బ్రహ్మానందం ఓ మీమ్‌ను కార్తీక్ టాగ్ చేస్తూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. డాక్టర్ బాబు వంటలక్క అంటే నీకు ఎందుకు అంత కోపం అని గతంలో కూడా వెన్నెల కిషోర్ కామెంట్ చేశాడు.