Ram Gopal Varma : క‌త్తిలాంటి ఫిగ‌ర్‌ని ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను.. శ్యామ‌ల‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Gopal Varma : క‌త్తిలాంటి ఫిగ‌ర్‌ని ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాను.. శ్యామ‌ల‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :16 February 2022,4:00 pm

Ram Gopal Varma :సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క్రియేట్ చేసే సెన్సేష‌న్స్ అంతా ఇంతా కాదు. ఆయ‌న మాట‌లు, ట్వీట్స్ చ‌ర్చనీయాంశంగా మారుతుంటాయి. కొత్త హీరోయిన్లను ప్రమోట్ చేయడమే కాదు.. ఇప్పటికే ఓ నేమ్, ఫేమ్ ఉన్నవారికి ఇంకాస్త బూస్టింగ్ ఇవ్వడంలోనూ తనదే పైచేయి అన్నట్లుగా దూసుకుపోతున్నారు. హాట్ బ్యూటీలతో బోల్డ్ మ్యాటర్స్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ.. అరియానా ఇంటర్వ్యూలో పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడటంతో యాంకర్ అరియానా పాపులర్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది.

‘అరియానా  టాక్ విత్ ఆర్జీవీ’ అంటూ ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూ విడుద‌ల కాగా, ఇందులో ఈ ఇద్ద‌రి ర‌చ్చ మాములుగా లేదు. ఇక అషూ రెడ్డితోను నానా ర‌చ్చ చేసాడు. వారికి సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఇక రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అక్కడ మొదటి సారి తెలుగు యాంకర్ శ్యామల ను చూసి కొంత ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా స్టేజ్ పైన యాంకర్ శ్యామల పై ఎవరూ ఊహించని విధంగా స్పందించి ఆమెను సిగ్గుపడిపోయి నవ్వుకునేలా చేశాడు.

ram gopal varma comments on shyamala

ram gopal varma comments on shyamala

Ram Gopal Varma : వ‌ర్మ ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..

ఇంత అందంగా ఉన్న మీరు ఇప్పటివరకు నా కళ్ళలో నుంచి ఎలా తప్పించుకున్నారు? అంటూ ఎదురుగానే స్టేజ్ పైనే శ్యామల తో చెప్పేశాడు. దీంతో యాంకర్ శ్యామల ఒక్కసారిగా నోరు తెరిచి సిగ్గు పడి పోయి నవ్వుకుంది. వర్మ అలా కామెంట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా విజిల్స్ వేశారు. తనను తోపు, రౌడీ, గుండా అన్నారు కానీ నేను రాస్కెల్‌ని కూడా అంటూ ఓపెన్ అయ్యారు ఆర్జీవీ. ఆయన నోటివెంట ఈ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన శ్యామల తెగ నవ్వేసింది. ఆ తరవాత బడవ రాస్కెల్ సినిమాను ఉద్దేశిస్తూ వర్మ మాట్లాడారు.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది