Ramarao On Duty Movie : రామారావు ఆన్ డ్యూటీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramarao On Duty Movie : రామారావు ఆన్ డ్యూటీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

Ramarao On Duty : వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న ర‌వితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 28వ తేదీన రిలీజైంది. రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్, వేణు తొట్టెంపుడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 July 2022,11:30 am

Ramarao On Duty : వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న ర‌వితేజ తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 28వ తేదీన రిలీజైంది. రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్, వేణు తొట్టెంపుడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన రావడం, ప్రమోషన్ కార్యక్రమాలు బ్రహ్మండంగా జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తొలి రోజు ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే.. రామారావు అన్ డ్యూటీకి హీరో రవితేజ సహ నిర్మాతగా వ్యవహరించడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాంలో ఈ చిత్రం 5 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల మేర బిజినెస్ జరగడంతో 15 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో డీల్ సెట్ అయింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి, ఓవర్సీస్‌లో 1.2 కోట్లు బిజినెస్‌తో మొత్తంగా 17.20 కోట్ల బిజినెస్ నమోదైంది. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.అయితే మూడు రోజుల ముందే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ పెద్దగా స్పందన లభించలేదు.

Rama Rao on Duty Movie First Day Collections

Rama Rao on Duty Movie First Day Collections

రామారావు ఆన్ డ్యూటీ తొలి రోజు ట్రేడ్ నిపుణుల రిపోర్టు ప్రకారం.. ఆంధ్రా విషయానికి వస్తే చిత్తూరులో తొలి రోజు 1.8 లక్షలు, ఏలూరులో 3.4 లక్షలు నమోదు చేసింది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో మంచి స్పందన లభించింది. వైజాగ్‌, శ్రీకాకుళం, విజయనగరం, పలాస, నర్సన్నపేట ప్రాంతాల్లో కొన్ని షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక హైదరాబాద్‌లో తొలి రోజు 4 లక్షల వసూళ్లు సాధించింది. ఈ సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని అధిగమిస్తుందా లేదా రెండు రోజులు వేచి చూస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది