Ramya Krishnan : రమ్యకృష్ణ ఎందుకు ఇలా మారింది.. అంత చెత్త పని చేస్తుందా?
Ramya Krishnan : నీలాంబరి అయిన శివగామి అయిన ఆ పాత్రలు రమ్యకృష్ణకే సరిగ్గా సూటవుతాయి అనేది అక్షరాల సత్యం. 80వ దశకంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నారు. దక్షిణాది మొత్తంలోనూ ఇప్పటికీ తన హవాను చూపిస్తున్నారు. అలాగే, ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో సందడి చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ.. అప్పుడప్పుడు తన క్యూట్ పిక్స్‌ని షేర్ చేస్తూ నానా రచ్చచేస్తుంది. వయస్సు పెరిగిన తరగని అందంతో రమ్యకృష్ణ తెగ హంగామా చేస్తుంది.
Ramya Krishnan : ఇలాంటి నిర్ణయం ఎందుకు?
డ్యాన్సర్‌గా శిక్షణ తీసుకున్న తర్వాత రమ్యకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రమ్య ‘వెళ్ళై మనసు’ అనే తమిళ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా వచ్చారు. ఆ తర్వాత ‘భలే మిత్రులు’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో హవాను చూపిస్తూ వస్తోన్న రమ్యకృష్ణ.. చాలా భాషల్లోని స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫలితంగా సుదీర్ఘ కాలంగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. ఇటీవల తెలుగులో కన్నా వేరే భాషలలో తన హంగామా చూపిస్తుంది.
రమ్యకృష్ణ తాజాగా కోలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుందని వార్తలు వస్తుండగా, ఇందులో రమ్యకృష్ణ పాత్ర కొంచెం అశ్లీలంగా ఉంటుందని తెలుస్తుంది. ఆ పాత్రలో రమ్యకృష్ణని ఊహించుకోలేకపోతున్నామని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దయచేసి అలాంటి పాత్రలలో నటించొద్దంటూ రమ్యకృష్ణకి సూచిస్తున్నారు. ‘లైగర్’తో వచ్చినా నిరాశగానే కొంత కాలంగా పాన్ ఇండియా ఆర్టిస్టుగా హవాను చూపిస్తోన్న సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ఇటీవలే పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ‘లైగర్’ మూవీలో కీలకమైన పాత్రను పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. దీంతో రమ్యకృష్ణ నిరాశ చెందారు.