Ramya Krishnan : డ్యాన్స్ షో కోసం ఒక్క ఎపిసోడ్‌కి రమ్యకృష్ణ అంత అమౌంట్ తీసుకుంటుందా?
Ramya Krishnan : 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల నటి రమ్యకృష్ణ. ఏ పాత్రకి అయిన వందకు వంద శాతం న్యాయం చేస్తుంది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను మెప్పిస్తుంది రమ్య. దేవత పాత్రలలో, తల్లి, అక్క వదిన పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ.. ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందారు రమ్యకృష్ణ. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో హీరోయిన్ గా తెలుగు చిత్రరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నరసింహ చిత్రంలో రజినీకాంత్‌తో పోటీపడి మరీ చేసిన ‘నీలాంబరి’ పాత్రను రక్తి కట్టించింది. బాహుబలి సినిమాతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.
Ramya Krishnan : రేంజ్ తగ్గదు..
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె తప్ప మరెవ్వరూ నటించలేరు అన్నంతగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇటీవలే లైగర్ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో నటించి అలరించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తున్న రమ్యకృష్ణ అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లతో పాటు బుల్లితెర షోలలోను మెరుస్తూ వినోదం పంచుతుంది. తాజాగా డాన్స్ ఐకాన్ పేరుతో ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమానికి యాంకర్స్‌గా ఓంకార్, శ్రీముఖి చేస్తున్నారు.
జడ్జ్‌గా చేస్తున్నందుకు రమ్యకృష్ణ ప్రతి ఎపిసోడ్‌కు దాదాపుగా 4.5 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.ఇది తెలుసుకొని అందరు షాక్ అవుతున్నారు. ఇక సినిమాలో ప్రతి రోజుకు పది లక్షల వరకు ఛార్జ్ చేస్తుందంట. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటుందన్న మాట. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న రష్మిక మందన్న సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుటారు. దీన్ని బట్టి చూస్తే రమ్యక్రిష్ణ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 1965 సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ 1985లో ‘భలే మిత్రులు’ చిత్రంతో తెరంగేట్రం చేసింది.