Sekhar Kammula : రానాకు హ్యాండిచ్చిన శేఖర్ కమ్ముల.. పెద్ద హీరోతో తర్వలోనే లీడర్ సీక్వెల్!
Sekhar Kammula : తెలుగు సినీ ఇండ్రస్టీలో శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరూ దర్శకుల వల్లే సినిమాలు తీసేందుకు ఆయన ఇష్టపడరు. ఆయన ప్రతీ సినిమాలో ఏదో ఒక సామాజిక కోణం. పల్లె పరిమళాన్ని చూపిస్తుంటాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన తొలిరోజుల్లో ఆనంద్, హ్యాపీడేస్ వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించినా.. ఆ తర్వాత ‘లీడర్’, ‘ఫిదా’ వంటి మంచి హిట్లు ఇచ్చారు. ఇటీవల ఎక్కువగా పల్లె మనుషుల జీవనం, కుతమతాల కుమ్ములాటలు, సొసైటీలో జరిగే అన్యాయాలు, ప్రభుత్వాల వైఖరిని తన సినిమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. అయితే, త్వరలోనే లీడర్ మూవీకి సీక్వెల్ తీయనున్నట్టు ఆయన ప్రకటించారు. అందులో హీరోగా రానాకు బదులు స్టార్ హీరోను అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, రానాకు హ్యాండిచ్చినట్టేనా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమాలంటే కుటుంబసభ్యులతో కలసి హాయిగా చూడొచ్చని ఇండస్ట్రీలో ఓ మంచి పేరుంది. ఆయన సినిమాల్లో వల్గర్ సన్నివేశాలు అస్సలే ఉండవు. సహజ సన్నివేశాలతో ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా మూవీని తెరకెక్కిచడంలో ఆయన దిట్ట. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాలు తీయడంలో శేఖర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. రీసెంట్‌గా ఆయన డెరెక్షన్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. టాపిక్‌లో భాగంగా రానాను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ‘లీడర్’ గురించి ప్రస్తావన రాగా.. ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని శేఖర్ కమ్ముల స్పష్టంచేశారు.
Sekhar Kammula : లీడర్ సీక్వెల్‌లో ఆయనే హీరోనా..
అయితే, ఇందులో రానాకు బదులు స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. అయితే, రానా స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భర్తీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. పవన్ ఇప్పటికే ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా మారిన నేపథ్యంలో ఆయనతో ఈ చిత్రం తీస్తే ఇద్దరికీ ప్లస్ అవుతుందని శేఖర్ భావిస్తున్నారట. ఈ సినిమాను 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విషయమై పవన్‌తో శేఖర్ కమ్ముల మధ్య చర్చ కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సిఉంది.