
Rashmi Gautam : చనిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ రష్మీ ఎమోషనల్..!
Rashmi Gautam : యాంకర్ రష్మి గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే స్లోగా స్టార్‌గా మారిన ఈ భామ యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా అవతారం ఎత్తి ఆ తర్వాత జబర్ధస్త్ షో టాప్ యాంకర్‌గా మారింది. రష్మి – సుడిగాలి సుధీర్‌ల ఆన్స్క్రీన్కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను బాగా దగ్గర చేసింది. వీరిద్దరి మధ్య ఏం ఉందో తెలియదు కాని ఇద్దరు ప్రేమాయణం నడిపిస్తున్నారని, సమ్ థింగ్ సమ్‌థింగ్ ఉందని చెప్పేవారు చాలా మంది.
రష్మీ గౌతమ్‌లో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంటూ వార్తలలో నిలుస్తుంటుంది. . లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. అయితే మార్చి 9న రష్మీ ఇంట్లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించడంతో చాలా ఎమోషనల్ అయింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్టగా, అది తన బేబి గర్ల్ అని అతి మృతి చెందడం తనకి తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పింది.
Rashmi Gautam : చనిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ రష్మీ ఎమోషనల్..!
అయితే నేటితో చుట్కీ మరణించి నెల కావడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నువ్వు ఈ భూమి మీద లేకపోయిన నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటావు.నువ్వు తిరిగి వస్తావని నేను నమ్ముతున్నను. నువ్వు వచ్చే వరకు నీ జ్ఙాపకాలలో బ్రతుకుతుంటాను అని రాసుకొచ్చింది రష్మీ. ఆ మధ్య చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన పిక్స్‌ను కూడా నెట్టింట్లో షేర్ చేసుకుంది. ఇక రష్మీ ఇప్పుడు జబర్ధస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా పాల్గొంటుంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.