Rashmi Gautham : పిల్ల‌ల‌కు అవి నేర్పించ‌కండి.. అలా నేర్పిస్తే.. అంటూ ర‌ష్మీ గౌత‌మ్ ఘాటు వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : పిల్ల‌ల‌కు అవి నేర్పించ‌కండి.. అలా నేర్పిస్తే.. అంటూ ర‌ష్మీ గౌత‌మ్ ఘాటు వ్యాఖ్యలు

 Authored By sandeep | The Telugu News | Updated on :2 February 2022,6:00 pm

Rashmi Gautham : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు ర‌ష్మీ గౌత‌మ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ.. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు. వీరిద్దిరికి సంబంధించి ఏ షో చేసిన అది సూప‌ర్ హిట్టే. అయితే ఇటీవ‌ల కాలంలో ర‌ష్మీ పెళ్లికి సంబంధించి తెగ ప్ర‌చారాలు న‌డిచాయి. ఈ అమ్మ‌డు ఇండ‌స్ట్రీకి సంబంధించిన వ్య‌క్తిని కాకుండా వేరే వ్య‌క్తిని వివాహం చేసుకుందంటూ ప్ర‌చారం జ‌రిగింది.

ర‌ష్మీ ఒకవైపు ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతూనే మ‌రోవైపు సామాజిక స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ తో టచ్‏లో ఉంటుంది. అలాగే రష్మీ గౌతమ్ మూగజీవులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో తెలిసిందే. అందులో కుక్కలు, ఆవులు అంటే ఇష్టపడుతుంది. సోషల్ మీడియా ఖాతాలో మూగ జీవాల‌కి సంబంధించిన సంఘటనల గురించి తనదైన శైలీలో స్పందిస్తుంది. గతంలో హైదరాబాద్‏లో కుక్కలపై మనుషులు వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మీ.తాజాగా ఓ దారుణ ఘటన మీద రష్మీ మరోసారి ఫైర్ అయ్యింది. బెంగుళూరులో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్మెంట్ లోని ఓ యువకుడు తన ఆడి కారును నడుపుతూ పడుకున్న కుక్క మీద నుంచి తీసుకెళ్లాడు.

rashmi gautham fire on bengaluru incident

rashmi gautham fire on bengaluru incident

Rashmi Gautham : ర‌ష్మీ ఫుల్ ఫైర్..

దీంతో ఆ కుక్క చనిపోయినట్లుగా తెలుస్తోంది.. అయితే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆ యువకుడి కుటుంబానికి ఫ్యామిలీకి బెంగుళూరులో ఎంతో పలుకుబడి ఉందని.. రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయట. అయినా కానీ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. దీనిపై సంతోషం వ్య‌క్తం చేసిన ర‌ష్మీ.. డబ్బుతో వస్తువులను కొనొచ్చు.. కానీ బుద్దిని, పద్దతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ అమాయకపు జీవి పడ్డ బాధను ఆ కుటుంబం అంతా కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కను రాళ్లతో కొట్టడం అనేది సరదా విషయం అని పిల్లలకు నేర్పించకండి.. వాళ్లే భవిష్యత్తులో ఇలా తయారవుతారు అంటూ చెప్పుకొచ్చింది రష్మీ.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది