Rashmika Mandanna : పూజా హెగ్డే కంటే రష్మికా మందన్నకే బాలీవుడ్‌లో క్రేజ్ ..అందుకు కారణం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : పూజా హెగ్డే కంటే రష్మికా మందన్నకే బాలీవుడ్‌లో క్రేజ్ ..అందుకు కారణం ఇదే..!

 Authored By govind | The Telugu News | Updated on :5 April 2022,1:00 pm

Rashmika Mandanna: పూజా హెగ్డే కంటే రష్మికకే బాలీవుడ్‌లో క్రేజ్ ..అందుకు కారణం ఇదే..! అంటూ ఈ మధ్యకాలంలో వీరి గురించి సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలోనూ ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చాలా ఏళ్ళకు గానీ స్టార్ డమ్ దక్కలేదు. బాలీవుడ్‌లో అయితే, ఇంకా ఆమె నటించిన ఒక్కటీ రిలీజ్ కాలేదు. గతంలో చేసిన సినిమా కూడా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన మహర్షి సినిమా పూజా హెగ్డే అందుకున్న ఫస్ట్ కమర్షియల్ హిట్.ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు చేసి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.

యంగ్ హీరో అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా పూజా గ్లామర్ వల్లే హిట్ అయిందనే టాక్ వినిపించింది. ఇక ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారుతుందనుకుంటే ఆ సినిమా ఫ్లాపయి రష్మికకు షాకిచ్చింది. కానీ, పూజా హెగ్డేతో పోల్చుకుంటే రష్మిక అన్ని విధాల మేకర్స్‌కు లక్ అండ్ సూపర్ సపోర్టింగ్ హీరోయిన్ అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో కూడా పూజా కంటే రష్మిక డిమాండ్ చేసినా కాస్త చూసి చూడనట్టుగా సైన్ చేసేస్తుందట.మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రష్మిక ఆ తర్వాత కూడా గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలతో క్రేజీ హిట్స్ అందుకుంది. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియన్ రేంజ్ హీరోయిన్‌గా భారీ క్రేజ్ తెచ్చుకుంది.

rashmika mandanna has more craze than pooja hegde

rashmika mandanna has more craze than pooja hegde

Rashmika Mandanna : మేకర్స్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తూ చేతిలోకి కొత్త ప్రాజెక్ట్స్..

దాంతో అమ్మడికి బాలీవుడ్‌లో దాదాపు అరడజను సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసింది. మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటుండగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా – రణ్‌బీర్ కపూర్ కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో రష్మిక మొదటిసారి భారీ స్థాయిలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి విషయాలలో పూజా కొన్ని కండీషన్స్ పెడుతుందట. కానీం, రష్మికకు ఎక్కువ సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకొనే కాస్త మేకర్స్‌కు అనుగుణంగా ప్రవర్తిస్తూ చేతిలోకి కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటుందట. ఇలా పూజాకు రష్మిక గట్టిగానే పోటీ ఇస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది