Eagle Movie : రవితేజ ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా .. ??
ప్రధానాంశాలు:
Eagle Movie Review : రవితేజ ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా .. ??
Eagle Movie : మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ ఈగల్ ‘ ఫిబ్రవరి 9న విడుదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవ్ జంద్ సంగీతం అందించారు. ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ గత సినిమా టైగర్ నాగేశ్వరరావు 39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రవితేజ కెరియర్ లోనే ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత డిజాస్టర్ అయింది.
అయితే ఇప్పుడు వచ్చిన ఈగల్ సినిమాని చాలా జాగ్రత్తగా 21 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. అయితే ఈ సినిమాకు 22 కోట్లు కలెక్షన్స్ వస్తే ఈగల్ సినిమా హిట్ అయినట్లు అవుతుంది. అయితే డైరెక్టర్ విక్రమ్, కేజిఎఫ్ సినిమాలను ఈగల్ సినిమాలో చూపించినట్లు కనిపిస్తుంది. హీరోని ఎక్కువగా బిల్డప్ చేయడం సినిమాటోగ్రఫీ అంతా ఆ సినిమా లాగా అనిపించాయి. ఇక ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ హడావిడిలో ఉంటారుష సినిమా సూపర్ హిట్ అయితే తప్ప వాళ్లు చూడని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈగల్ సినిమా మార్జినల్గా హిట్ అవ్వచ్చు. లేదంటే లాస్ అవ్వచ్చు. మొదటి రోజు కలెక్షన్స్ తక్కువ వచ్చిన సినిమాకి టాక్ వస్తే తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడవచ్చు.
ఈగల్ సినిమా స్టోరీ మరి ఆకట్టుకునేలా కాదు కానీ యావరేజ్ గా ఉన్నట్లుగా ఉంది. స్టోరీ పరంగా యావరేజ్ గా ఉన్నా రవితేజ యాక్షన్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సినిమా ఫ్లాపై అవకాశాలు లేవు కానీ రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా సూపర్ హిట్ అయి కలెక్షన్స్ వస్తే రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్లు అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. దేవ్ జెంద్ సంగీతం అందించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ మధుబాల, అవసరాల శ్రీనివాస్ వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.