Ravi Teja : “రావణాసుర” ప్రమోషన్ కార్యక్రమంలో ఆడవాళ్ళ పై రవితేజ వైరల్ కామెంట్స్.. వీడియో
Ravi Teja : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరో మాస్ మహారాజ రవితేజ. గత ఏడాది డిసెంబర్ నెలలో “ధమాకా” తో మంచి హిట్ అందుకోగా..ఈ జనవరి నెలలో చిరంజీవితో చేసిన “వాల్తేరు వీరయ్య” సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పుడు “రావణాసుర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రవితేజ రాబోతున్నాడు. ఏప్రిల్ 7వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.
దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.రీసెంట్ గా సినిమా హీరో రవితేజతో పాటు మరో హీరో అక్కినేని సుశాంత్ నీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని సినిమాలు ఆడవాళ్లు చూడరు అనే వ్యాఖ్యని రవితేజ ఖండించారు. సినిమా అనేది నచ్చితే ఎవరైనా చూస్తారు అని.. పేర్కొన్నారు. ఇదే సమయంలో జీవితంపై క్లారిటీ ఉండి తనపై తనకి కాన్ఫిడెంట్ కలిగిన ఆడవాలంటే తనకు ఇష్టమని రవితేజ పేర్కొన్నారు.
ఏదైనా మొహం మీద చెప్పేసే ఆడవాళ్లు ముఖ్యంగా పొగరు కలిగిన ఆడవాళ్లు… బాగా నచ్చుతారు. ఆడవాళ్లకు పొగరు ఉంటేనే బాగుంటుంది అంటూ రవితేజ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒకలపై ఆధారపడకుండా ఎవరూ లేకపోయినా నేను ఉండగలను.. అనే ఆత్మ స్థైర్యం కలిగిన వాళ్ళు ఇష్టమని తెలిపారు. ఇదే సమయంలో సుశాంత్ సైతం… జీవితంపై క్లారిటీ కలిగిన ఆడవాళ్లు.. ఇష్టమని అన్నారు. దాదాపు రవితేజ గారి అభిరుచిలే.. నాకు ఆడవాళ్ళ పై కలిగిన ఇష్టాలని పేర్కొన్నారు.