" ఖిలాడి " బ్యూటీస్ తో రవితేజ ఘాటు రొమాన్స్ ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

” ఖిలాడి ” బ్యూటీస్ తో రవితేజ ఘాటు రొమాన్స్ ..!

ఖిలాడి .. మాస్ మహారాజ రవితేజ నటించబోతున్న లేటెస్ట్ సినిమా. వరస ఫ్లాప్స్ తర్వాత రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు సునామీని సృష్ఠిస్తోంది. 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ అయినా క్రాక్ మంచి లాభాల బాటలో నడుస్తోంది. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా […]

 Authored By govind | The Telugu News | Updated on :15 January 2021,11:13 am

ఖిలాడి .. మాస్ మహారాజ రవితేజ నటించబోతున్న లేటెస్ట్ సినిమా. వరస ఫ్లాప్స్ తర్వాత రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు సునామీని సృష్ఠిస్తోంది. 50 పర్సెంట్ ఆక్యూపెన్సీ అయినా క్రాక్ మంచి లాభాల బాటలో నడుస్తోంది. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా తో దర్శకుడు గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ సాధించారు.

Ravi Teja and Shruti Haasan's Krack Sankranti poster released | Telugu Movie News - Times of India

ఖిలాడి టైటిల్ పోస్టర్ తోనే హిట్ అని చెప్పుకుంటున్న ఫ్యాన్స్ ..!

హీరోయిన్ గా శృతిహాసన్ కూడా దాదాపు మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో సాలీడ్ సక్సస్ అందుకుంది. మొత్తంగా క్రాక్ సినిమా చిత్ర యూనిట్ మొత్తానికి మచి సక్సస్ ని ఊపుని ఇచ్చింది. ఈ క్రమంలో రవితేజ నెక్స్ట్ సినిమాగా ఖిలాడి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నాడు. గతంలో రవితేజ తో వీర సినిమాని తెరకెక్కించిన రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ తో పాటు రవితేజ లుక్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

Ravi Teja Khiladi Telugu Movie Cast Crew, Posters, Release date, Songs

ఇక ఈ సినిమాలో రవితేజ ఇద్దరు హాట్ బ్యూటీస్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఖిలాడి సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించబోతుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటించబోతున్నారు. మీనాక్షి చౌదరి ఇప్పటికే సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమా చేస్తోంది. డెబ్యూ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక డింపుల్ హయతి ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో సూపర్ హిట్ అన్న సాంగ్ లో స్టెప్పులేసింది. డింపుల్ హయతి కి ఈ సినిమా ఛాన్స్ అని చెప్పాలి. ఇక ఖిలాడి సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది