Razakar Villain : రజాకార్ సినిమా విలన్ ఇంత అందంగా ఉంది…ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ కూడా..!
ప్రధానాంశాలు:
Razakar Villain : రజాకార్ సినిమా విలన్ ఇంత అందంగా ఉంది...ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ కూడా..!
Razakar Villain : రజాకార్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. గద్దర్ అవార్డుల్లో పలు పురస్కారాలు గెలుచుకుంది.

Razakar Villain : రజాకార్ సినిమా విలన్ ఇంత అందంగా ఉంది…ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ కూడా..!
Razakar Villain : అందమంటే ఇది కదా..
యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా, వేదిక, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కానీ వీరందరికన్నా ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించినది ఖాసీం రజ్వీ పాత్ర. ఈ పాత్రలో నటించిన అర్జున్ రాజ్ నిజాం పరిపాలనలోని నిరంకుశతను అద్భుతంగా చూపించి, ప్రేక్షకులను ఆకర్షించాడు. గం గం గణేశా, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు.
తమిళ్, హిందీ సినిమాల్లో కూడా తనదైన స్టైల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ తమిళ్, హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. అర్జున్ రాజ్ కూతురు సారా అర్జున్ కూడా హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా? ‘నాన్న’ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్టే సారా అర్జున్. ఆ సినిమాలో ఆమె చూపిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ధురంధర్ అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
View this post on Instagram