Keeravani Son : అందులో నువ్వు స్లోనా, స్పీడా.. కీర‌వాణి కొడుకుని రీతూ అంత ప‌చ్చిగా అడిగేసిందేంటి..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Keeravani Son : అందులో నువ్వు స్లోనా, స్పీడా.. కీర‌వాణి కొడుకుని రీతూ అంత ప‌చ్చిగా అడిగేసిందేంటి..!

Keeravani Son : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల భామ రీతూ చౌద‌రి. ఈ షోలో త‌న టాలెంట్ చూపించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. కొంత కాలంగా టెలివిజన్ రంగంలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. రీతూ యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. కొంత కాలం అలా చేసిన తర్వాత ‘గోరింటాకు’ అనే సీరియల్‌తో యాక్టింగ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Keeravani Son : అందులో నువ్వు స్లోనా, స్పీడా.. కీర‌వాణి కొడుకుని రీతూ అంత ప‌చ్చిగా అడిగేసిందేంటి..!

Keeravani Son : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల భామ రీతూ చౌద‌రి. ఈ షోలో త‌న టాలెంట్ చూపించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. కొంత కాలంగా టెలివిజన్ రంగంలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. రీతూ యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. కొంత కాలం అలా చేసిన తర్వాత ‘గోరింటాకు’ అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్ లోకి అడుగుపెట్టింది.. అనంతరం ‘సూర్య వంశం’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆక‌ర్షించింది.

Keeravani Son : ఏంటా మాట‌లు..

ప్ర‌స్తుతం దావత్ అనే షోని హోస్ట్ చేస్తుంది రీతూ. రీసెంట్‌గా ఈ షోకి కీరవాణి తనయుడు శ్రీసింహా హాజ‌ర‌య్యాడు. ఈ షోకి సంబంధించిన‌ ప్రోమో విడుద‌ల కాగా, ఇది మ‌రింత‌ వైరల్ గా మారింది. ఇందులో రీతూ.. శ్రీసింహాకి చుక్కలు చూపించింది. పచ్చిగా డబుల్ మీనింగ్ ప్రశ్నలు కూడా అడుగుతూ ఇబ్బంది పెట్టింది.. మీ ఇంట్లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, హీరో ఇలా అందరూ ఉన్నారు ఎలా సాధ్యం అని రీతూ ప్రశ్నించ‌గా, దానికి స‌మాధానంగా మేము పేకాట ఆడినట్లు ఇవన్నీ పంచుకోలేదు అంటూ శ్రీసింహా చెప్పుకొచ్చాడు. ఇక మీ ఫ్యామిలీ మొత్తం మీ సినిమా చూస్తుంటే అందులో మీరు లిప్ లాక్ సీన్ వ‌స్తే మీ ఫ్యామిలీ రియాక్ష‌న్ ఏంట‌ని అడిగింది.

Keeravani Son అందులో నువ్వు స్లోనా స్పీడా కీర‌వాణి కొడుకుని రీతూ అంత ప‌చ్చిగా అడిగేసిందేంటి

Keeravani Son : అందులో నువ్వు స్లోనా, స్పీడా.. కీర‌వాణి కొడుకుని రీతూ అంత ప‌చ్చిగా అడిగేసిందేంటి..!

ఇక ఆ సీన్ చూసిన‌ప్పుడు అక్క‌డ అది అవ‌స‌రం లేదు కదా, నువ్వే అడిగావా అని రాజమౌళి ప్రశ్నిస్తారా అని రీతూ అడిగింది. చ..చ.. అలా అడగరు అని సింహా తెలిపాడు. అయితే బాగా పెట్టావు అని కాంప్లిమెంట్ ఇస్తారా అంటూ రీతూ త‌న‌దైన శైలిలో పంచ్ వేసింది. ఇక రీతూ ప్ర‌శ్న‌ల‌కి తెగ ఇబ్బంది ప‌డిన శ్రీ సింహా… ఏవేవో అడుగుతున్నారు.. నాకు అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.చివ‌రిగా ఓ డబుల్ మీనింగ్ ప్రశ్న అడిగింది. సింహా స్లోనా.. ఫాస్టా.. అని అడిగింది.. ఎందులోనో వివరించ‌మ‌ని సింహా అడుగుతాడు. దానికి రీతూ స‌మాధానంగా ఎందులోనో మీకు తెలుసు నాకు తెలుసు.. స్పెసిఫిక్ గాచెప్పడం ఎందుకు ? అంటూ రీతూ అన‌డంతో సింహా సిగ్గుతో త‌ల‌దించుకున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది