Renu Desai : వాటికి దూరంగా ఉండటం చాలా కష్టం!.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Authored By aruna | The Telugu News | Published on: August 20, 2022, 1:40 pm

Renu Desai : రేణూ దేశాయ్ ప్రస్తుతం విదేశాల్లో ఎంతగా తిరిగేస్తోందో అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఫారిన్‌లోనే తిరిగేస్తోంది. స్కాట్లాండ్, యూరప్ దేశాలు అంటూ అక్కడి వీధుల్లోనే చక్కర్లు కొడుతోంది.అకిరా, ఆద్యలతో కలిసి రేణూదేశాయ్ అక్కడ ఎంజాయ్ చేస్తోంది. మామూలుగా అయితే రేణూ దేశాయ్ ఆధ్యాత్మిక టూర్‌లు వేస్తుంటుంది. కాశీ, హిమాలయాలు అంటూ రేణూ దేశాయ్ తిరుగుతుంటుంది. కానీ ఇలా ఫారిన్ టూర్ వేయడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు. మొత్తానికి ఇప్పుడు రేణూ దేశాయ్ మాత్రం ఫారిన్‌లో చక్కర్లు కొడుతోంది. రేణూ దేశాయ్ తన కొడుకు అకిరాను ఫారిన్ కంట్రీలోనే చదువు చెప్పించాలని చూస్తున్నట్టుంది. అందుకే ఇలా అక్కడ ఇన్ని రోజులు ఉండి..

అకిరా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. అసలే అకీరా గత రెండు నెలల క్రితం ప్లస్ 2 కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు అకిరా తనకు ఇష్టమైన మ్యూజిక్‌ను నేర్చుకుంటాడో.. లేదో ఇంకా ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటాడో.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అంటూ ఇంకా ఏదైనా ప్రయత్నిస్తాడో చూడాలి. రేణూ దేశాయ్ ఈ మధ్య మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంటోంది. మామూలుగా అయితే రేణూ దేశాయ్ నెట్టింట్లో అంత యాక్టివ్‌గా ఉండదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండేది. అయితే మూడో వేవ్‌లో రేణూ దేశాయ్ కరోనా బారిన పడింది. దీంతో రేణూ దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.

Renu Desai Funny Post On Chai Biscuit

Renu Desai Funny Post On Chai Biscuit

అలా మధ్యలో చాలా రోజులే సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్.. ఇప్పుడు మళ్లీ ఫుల్ యాక్టివ్ అయింది. గత కొన్ని రోజులు ఫారిన్ ట్రిప్‌‌కు సంబంధించిన ఫోటలు, వీడియోలు, రీల్ వీడియోలతో హంగామా చేస్తోంది. ఇప్పుడు ఆమె ఓ పోస్ట్ వేసింది. మన ఇండియన్స్ అంటే.. ఎక్కువగా చాయ్ బిస్కెట్స్ తింటుంటారు.. అందులోనూ కొంత మంది పార్లేజీ బిస్కెట్స్ చాయ్ కాంబోను ఇష్టపడుతుంటారు. కానీ ఇవి ఫారిన్ కంట్రీలో అంతగా ఉండవు. ఇదే విషయాన్ని ఇప్పుడు రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. చాయ్ బిస్కెట్ అనేది కాంబినేషన్, దాన్ని మిస్ అవుతుండటం చాలా కష్టం.. అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp