Renu Desai : క్రిస్మస్ కోసం ఆద్య స్పెషల్.. అసలు విషయం చెప్పిన రేణూ దేశాయ్
Renu Desai : రేణూ దేశాయ్ నెట్టింట్లో ఎంత సందడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల ప్రతిభ గురించి చెబుతూ తల్లిగా ఎప్పుడూ మురిసిపోతూనే ఉంటుంది. ఆద్య ఫోటో గ్రఫీ టాలెంట్, కుకింగ్ టాలెంట్ గురించి రేణూ దేశాయ్ పోస్ట్‌లు చేస్తుంటుంది. ఇక అకీరా నందన్ మ్యూజిక్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆటలు, పాటలు అంటే అకీరాకు విపరీతమైన ఇష్టమట.
ఇక ఆద్య అయితే బేకింగ్‌లో స్పెషలిస్ట్ అయ్యేట్టుందని తెలుస్తోంది. క్రిస్మస్ నెల అంటే అందరికీ గుర్తుకొచ్చేవి కేకులే. అలా ఈ స్పెషల్ క్రిస్మస్ సందర్భంగా ఈ సారి ఆద్య స్పెషల్ కేక్ తయారు చేస్తోందట. పూర్తిగా వేగన్ కేక్‌ను ఆద్య తయారు చేస్తోంది. ఈ మేరకు రేణూ దేశాయ్ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇందులో ఆద్య కొందరి ట్రైనర్ల సమక్షంలో కేక్ తయారీని నేర్చుకుంటోంది.

Renu Desai Shares Aadya Christamas Cake Baking Video
Renu Desai : బేకింగ్‌లో ఆద్య బిజీ
దీనికి సంబంధించిన వీడియోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. మొత్తానికి ఆద్య మాత్రం ఇలా తనకు ఎంతో ఇష్టమైన బేకింగ్‌లో కొత్త పద్దతులను నేర్చుకుంటుందన్న మాట. ఇది వరకే ఫోటో గ్రఫీలోని తన టాలెంట్‌ను అందరికీ చూపించింది. ఇప్పుడు బేకింగ్‌లో తన సత్తాను చాటుతుంది. మొత్తానికి రేణూ దేశాయ్ మాత్రం తన పిల్లల టాలెంట్ చూసి మురిసిపోతోంది.
View this post on Instagram