Renu Desai : కొడుకు చేసిన పని చూసి రేణూ దేశాయ్ ఏమందో చూడండి !

Authored By aruna | The Telugu News | Published on: July 17, 2023, 3:00 pm

Renu Desai : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ బద్రి ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ గురించి అందరికీ తెలిసిందే. బద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మరోసారి పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ జానీ ‘ సినిమాలో నటించింది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరమైంది. పెళ్లికి ముందే అకిరా నందన్ కు జన్మనిచ్చిన రేణు దేశాయ్ పెళ్లి తర్వాత ఆద్యకు జన్మ ఇచ్చారు. అంత సంతోషంగా ఉంటున్న టైంలో వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికి విడిపోయారు.

ఇక అకిరానందన్, ఆద్యల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటున్నాడని వారికి కావాల్సినవన్నీ అందిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని ప్రారంభించాడు. కానీ రేణు మాత్రం తన పిల్లలతోనే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. గతంలో బుల్లితెరపై ఎంట్రీ కూడా ఇచ్చారు. ఢీ డ్రామా జూనియర్స్ లో జడ్జ్ గా కొంతకాలం చేశారు. ఆ తర్వాత బుల్లితెరకు దూరం అయిపోయారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటారు.

Pawan Kalyan's former wife Renu Desai, son test COVID positive | Regional  News | Zee News

రేణు దేశాయ్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. సమయం దొరికితే పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు తనపై వచ్చే బ్యాడ్ కామెంట్లకి రిప్లై ఇస్తూ ఫైర్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా రేణు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తనవి ఒకప్పటి ఫోటోలు అందంగా ఎడిట్ చేసి ఉంచడంతో దానిని తన కొడుకు అకీరా కొన్ని నిమిషాలలో ఈ ఫొటోస్ ని ఎడిట్ చేశాడు అని తెలిపింది. కానీ ఈ ఫోటోలన్నీ భయంగా ఉన్నాయి అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో కొందరు అభిమానులు అచ్చం సీతలాగా ఉన్నావు అని, ఆది పురుష్ సినిమాలో మీరే సీతగా చేస్తే బాగుండేది అని సరదాగా కామెంట్స్ చేశారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp