RGV : రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రివ్యూ కోసమే జగన్ ని కలిసాడా ?
RGV : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ వ్యూహం ‘. ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను ఆధారంగా తీసుకొని సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఆర్జీవీ ఈ సినిమాలో తీసుకున్నా పాత్రధారుల ఫోటోలు విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైయస్ భారతి ఫోటోలను రిలీజ్ చేశారు. ఇప్పుడు జగన్ పాత్రలో నటిస్తున్న తమిళ నటుడు అజ్మల్, భారతి పాత్ర నటిస్తున్న మానస రాధాకృష్ణన్ ఫోటోలు విడుదల చేశారు. తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఆర్జీవీ ఇటీవల విడుదల చేశారు.
ఇటీవల చంద్రబాబు నాయుడు వర్కింగ్ స్టిల్ కూడా బయటికి వచ్చింది. ఏ క్యారెక్టర్ ఫ్రం వ్యూహం అని ఆర్జీవి ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ దసరా నాటికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీలో జరిగిన రాజకీయా పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే తాజాగా ఆర్జీవి వైయస్ జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది. తాడేపల్లి లోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సుమారు గంటపాటు సమావేశం ఏర్పాటు అయింది. వ్యూహం సినిమా అప్డేట్స్ ఏంటనేది ఆర్జీవి జగన్ తో ప్రస్తావించారు. వ్యూహం సినిమాను రెండు పార్ట్ లుగా తీస్తానని అన్నాడు.
మొదటి పార్ట్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఓదార్పుయాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, కడప లోక్‌సభ ఉప ఎన్నికలో రికార్డుస్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసుల వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వంటి అంశాలు ఉండబోతోన్నాయి. రెండవ పార్ట్ లో 2014 తర్వాత రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మైక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, మహాప్రస్థానంకు దారి తీసిన పరిణామాలు ఆర్జీవి చూపించనున్నారు.