Hyper Aadi : హైపర్ ఆది వల్లే నేను జబర్ధస్త్ మానేశాను… ఛాన్స్ అడిగితే నన్ను అలా చేయమన్నారు..!
ప్రధానాంశాలు:
Hyper Aadi : హైపర్ ఆది వల్లే నేను జబర్ధస్త్ మానేశాను... ఛాన్స్ అడిగితే నన్ను అలా చేయమన్నారు..!
Hyper Aadi : జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంత మంది ఆ షో వలన లైఫ్‌లో పూర్తిగా సెటిల్ అయ్యారు కూడా. జబర్దస్త్.. ఎందరో నూతన కళాకారులకు జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా పరిచయం అయ్యి గుర్తింపు తెచ్చుకుని.. నేడు బుల్లితెర, వెండి తెర మీద రాణిస్తున్నవారిలో రీతూ చౌదరి ఒకరు. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ అందాల బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2006లో “అంతరాత్మ” సీరియల్స్‌తో రీతూ చౌదరి కెరీర్ ప్రారంభించింది.
Hyper Aadi అదే కారణం..
‘గోరింటాకు’ మిస్టర్ పెళ్ళికొడుకు, కుటుంబ సభ్యులు, ‘సూర్య వంశం’, ‘ఇంటిగుట్టు’ వంటి అనేక సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. “కేరింత”. “రామలీల”, “సరైనోడు” వంటి అనేక తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొనడంతో రీతూ అందరి దృష్టిని ఆకర్షించింది.ఆ తర్వాత రీతూకి అనేక ఆఫర్స్ వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తాను జబర్ధస్త్ నుండి బయటకు రావడానికి గల కారణం చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.
గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. ఆ సమయంలో హైపర్ ఆదితో మంచి కెమస్ట్రీ ఉండేది. దాంతో తెర మీద వీళ్లిద్దరి చనువు చూసి వీరిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. అయితే కొంత కాలానికి హైపర్ ఆది, రీతూ ఇద్దరూ జబర్దస్త్ మానేశారు. ప్రస్తుతం ఆమె కిలాడీ గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే షోలో చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ మానేయడానికి గత కారణాలు వివరించింది రీతూ. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవడంతోనే తాను ఆ షోకు వెళ్లడం లేదని వివరణ ఇచ్చింది. హైపర్ ఆది లేనప్పుడు నేను అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినట్లు రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. సినిమాల్లో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. వాటి కోసం వెళితే ఈ అమ్మాయి బోల్డ్‌గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టం అంటున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ. కాకపోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి’’ అని చెప్పుకొచ్చింది.