Bigg Boss OTT Telugu : ఆర్జే చైతూ, అరియానా ఇద్దరూ బయట ఫ్రెండ్సా.. అందుకే బిగ్ బాస్ లో కలిసి ఆడుతున్నారా?
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఇప్పుడిప్పుడే హీటెక్కుతోంది. ఎందుకంటే రెండు వారాలు ఇప్పటికే ముగిసిపోయాయి. ఇద్దరు కంటెస్టెంట్లను కూడా ఇంట్లో నుంచి పంపించేశారు. అలాగే.. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, లవ్ ట్రాక్ లు, గ్రూపులు అన్నీ స్టార్ట్ అయ్యాయి.నిజానికి.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు అందరూ ఒకరికి మరొకరు పరిచయం అయి ఉండరు. అలా తెలియకుండా ఉన్న వాళ్లకే దాదాపుగా హౌస్ లోకి తీసుకునేందుకు బిగ్ బాస్ ఆసక్తి చూపిస్తుంటాడు. ఎందుకంటే.. తెలిసిన వాళ్లు బిగ్ బాస్ లోకి వస్తే.. వాళ్లు కలిసి ఆడుతారని.. వాళ్లు కలిసి ఆడటంతో పాటు..
వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు వచ్చే అవకాశం ఉండదని బిగ్ బాస్ భావించి అస్సలు ఒకరికి మరొకరు తెలిసిన వాళ్లను బిగ్ బాస్ తీసుకోడు.కానీ.. ఈ సీజన్ లో మాత్రం బయటే పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వాళ్లలో ఒకరు అరియానా.. ఇంకొకరు ఆర్జే చైతూ. ఎందుకంటే.. అరియానా బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే తను యాంకర్ గా ఉంది. ఆర్జే చైతూ ఎలాగూ ఆర్జేగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి.. ఇద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది.అయితే.. ఇద్దరికీ ముందే తాము బిగ్ బాస్ హౌస్ లోకి వస్తామని తెలుసా? అందుకే.. ఇద్దరూ కలిసి హౌస్ లో గేమ్ ఆడుతున్నారని.

rj chaitu and ariyana playing together in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : ముందే ఇద్దరూ అనుకొని హౌస్ కు వచ్చారా?
. మిగితా కంటెస్టెంట్లు గుర్తించేశారు. తన టీమ్ మెంబర్ తేజస్విని దీన్ని పసిగట్టి.. ఇద్దరూ కలిసి ఆడుతున్నారని చెప్పి ఇద్దరినీ నామినేట్ చేసింది.అరియానా, చైతూ ఇద్దరూ బయట ఫ్రెండ్స్ కావచ్చు. అయినా ఇక్కడ కూడా వాళ్లు ఇద్దరూ కలిసి ఆడుతున్నారు. అది కరెక్ట్ కాదు అంటూ తేజస్విని నామినేట్ చేసింది. అంటే.. ఇద్దరు నిజంగానే కలిసి ఆడుతున్నారా? చివరి వరకు ఇద్దరూ కలిసి ఆడి.. ఆ తర్వాత ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకోవాలని అనుకుంటున్నారా? దీనిపై ఇతర కంటెస్టెంట్లు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.