Rocket Raghava : ఇంట్లో రాకెట్ రాఘవ పరిస్థితి మరీ దారుణం.. తేడా కొట్టేసినట్టుందే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rocket Raghava : ఇంట్లో రాకెట్ రాఘవ పరిస్థితి మరీ దారుణం.. తేడా కొట్టేసినట్టుందే?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 June 2022,1:30 pm

Rocket Raghava : జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాఘవ స్కిట్లు ఫుల్ క్లీన్‌గా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కడా కూడా అశ్లీలత కనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ జోలికి వెళ్లడు. అలా తన స్కిట్లతో రాఘవ నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ మధ్యలో అయితే రాఘవ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టేశాడు. రాఘవ ఈ మధ్య శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపిస్తున్నాడు. అక్కడ తనలోని కొత్త రూపాన్ని చూపించాడు.

లేడీ కంటెస్టెంట్‌తో రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తున్నాడు.అలా ఓ పర్ఫామెన్స్‌ బాగానే క్లిక్ అయింది. దాంతో వానఝల్లు గిల్లుతుంటే అనే పాటకు గత వారంలో వానలో ఓ పాటకు స్టెప్పులు వేశాడు. అలా ఆ రొమాంటిక్ పర్ఫామెన్స్ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే దానిపై రాఘవ ఫన్నీ స్కిట్ వేశాడు. అలా అమ్మాయితో డ్యాన్స్ చేయడం వల్ల తన ఇంట్లో తనకు ఏర్పడిన పరిస్థితులపై కౌంటర్లుగా స్కిట్ వేశాడు.

Rocket Raghava Funny Skit On His Romance In Sridevi Drama Company

Rocket Raghava Funny Skit On His Romance In Sridevi Drama Company

అలా రొమాన్స్ చేయడంతో తన కొడుకు కూడా తనను గౌరవించడం లేదన్నట్టుగా సెటైర్ వేసుకున్నాడు. ఇక తన భార్య అయిత ఆ పర్ఫామెన్స్ చూసిన ప్రతీ సారి వాయించి పడేస్తుందన్నట్టుగా చూపించాడు. అయితే ఇది మరి కామెడీగా చేశాడా? లేదా నిజంగానే అలాంటి పరిస్థితి ఏర్పడిందా? అన్నది తెలియదు. కానీ రాఘవ మాత్రం మళ్లీ తన కొడుకు మురారిని తీసుకొచ్చాడు. తన కొడుకుతో కలిసి స్కిట్ వేశాడు.వేరే వారి స్కిట్లోనూ మురారి నవ్వులు పూయిస్తున్నాడు. మొత్తానికి రాఘవ మాత్రం తన మార్క్ మిస్ అవ్వడం లేదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది