Sridevi Drama Company : అందుకే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ క్లిక్ అయింది.. మళ్లీ టచ్ చేసేశారు
Sridevi Drama Company : శ్రీదేవీ డ్రామా కంపెనీ మొదట్లో విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. కంపెనీ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అందరూ సెటైర్లు వేసేశారు. సుధీర్, ఆది వంటి వారు కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద తమ తమ స్కిట్లలో కూడా కౌంటర్లు వేైసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వారే శ్రీదేవీ డ్రామా కంపెనీని నిలబెట్టేందుకు ట్రై చేశారు.మొత్తానికి వారు అనుకున్నది సాధించేశారు.ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ మంచి పొజిషిన్‌లో ఉంది. మొత్తానికి శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటే బుల్లితెరపై ఓ మార్క్ కూడా పడింది. ప్రతీ ఆదివారం వచ్చే ఈ షోలో స్పెషల్ థీమ్స్ ఉంటాయి.
సమాజంలోని సమస్యలు, రంగస్థల నటులు, వృద్దులు, మహిళలు ఇలా ఏదో ఒఖ థీమ్ తీసుకుని షోను నడిపిస్తుంటారు. వచ్చే ఆదివారం మా నాన్నకు పెళ్లి అంటూ ఓ షోను ప్లాన్ చేశారు.ఈ ఆదివారం నాడు బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్ ఇలా అందరూ తమ తమ తండ్రులను పట్టుకొచ్చారు. ఇక బుల్లెట్ భాస్కర్ తండ్రి అయితే ఇది వరకే ఎన్నో స్కిట్లలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయనే హైలెట్ అయ్యాడు. అయితే రోహిణికి సంబంధించిన టాపిక్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. అందులో ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది.

Rohini And Her Father In Sridevi Drama Company
ఎందుకంటే రోహిణి ఎప్పుడూ కూడా తన తండ్రి గురించి చెప్పలేదు.రోహిణి చేసే యూట్యూబ్ వీడియోల్లోనూ తండ్రి గురించి చెప్పలేదు. చూపించలేదు. ఎక్కడో ఉండే ఆయన్ను పట్టుకుని రోహిణికి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ తండ్రీ కూతుళ్ల ఎమోషన్ చూసి అందరూ కంటతడి పెట్టాల్సిందే. ఇక రోహిణి కోసం తండ్రి అపురూపమైన బహుమతిని పట్టుకొచ్చాడు. స్పెషల్ రింగ్ తీసుకొచ్చాడు.. రోహిణికి ఇచ్చాడు.. ఈ ఇద్దరినీ చూసి అందరూ కన్నీరుపెట్టేశారు. ఇలా కొత్తగా ఆలోచిస్తోంది కాబట్టే శ్రీదేవీ డ్రామా కంపెనీ బాగా క్లిక్ అవుతోంది.