Roja : నువ్వు, నా కూతురివి కాదంటూ రోజా అంత మాటలనేసిందా?
Roja : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపిన రోజా సెకండ్ ఇన్నింగ్స్‌లో జడ్జ్‌గా వ్యవహరించింది. ముఖ్యంగా జబర్ధస్త్ షోకి జడ్జ్‌గా వ్యవహరించిన రోజా చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఇక సినీ సెలబ్రిటీగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా రోజా తన సత్తా చాటింది. తనదైన శైలిలో ప్రజలతో మమేకమై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మంత్రిగా పని చేస్తున్నారు. ఇలా సినిమాల పరంగా, రాజకీయపరంగా ఎంతో బిజీగా ఉండే రోజా కాస్త ఖాళీ సమయం దొరికిన కూడా తన ఫ్యామిలీతో సరదగా గడుపుతుంది.
Roja : అన్షుపై అమితమైన ప్రేమ..
ఫ్యామిలీ వేడుకలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తాజాగా రోజా తన కూతురికి సంబంధించిన ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. డియర్..థాంక్యూ నువ్వు నా కూతురువి కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, నన్ను ఇంతల అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ అంటూ.. తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రోజా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అన్షు తల్లికి తగ్గ తనయ అని పలు సందర్భాలలో నిరూపించుకుంది.
అన్షు మాలిక ఎంట్రీపై కొన్ని రోజుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రోజా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్షుమాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. ఓ సినీ వారసుడు నటించనున్న మూవీలో అన్షుమాలిక కథానాయికగా నటించనుందని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఇక అన్షు ఇప్పటికే యూఎస్‌లో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సంపాదించుకుంది. ప్రస్తుతం అన్షు వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రచయితగా రాణిస్తోన్నారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది.