Vijayendra prasad : RRR రైటర్ రివీల్ చేసిన టాప్ సీక్రెట్ 900 కోట్లు కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్.. హీరో ఎవరంటే..?
Vijayendra prasad : ఆర్ఆర్ఆర్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్..అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గతంలో ఆయన రాసిన ఓ ఇండస్ట్రీ హిట్ సినిమాకి సీక్వెల్ కథ రాస్తున్నట్టు టాప్ సీక్రెట్ ను రివీల్ చేశారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి సీక్వెల్స్. అలాంటి సినిమాకి కథ అందించడంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లో పాన్ ఇండియన్ కథలను అందించి తన సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటుకున్న విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కథ అందించారు. భారీ మల్టీస్టారర్‌గా ఆయన తనయుడు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

RRR writer vijayendra prasad revealed top secret
విజయేంద్ర ప్రసాద్ ఒక కథ పూర్తి కాగానే మరో కథ సిద్దం చేసే పనిలో ఉంటారు. ఆయన కూడా దర్శకత్వం చేసినప్పటికి కథ రాయడమే సులభంగా భావిస్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు తమిళ, హిందీ, తెలుగులో రూపొందుతున్న అమ్మ జయలలిత బయోపిక్ సినిమాకి కథ అందించారు. ఆమె సినీ, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కథలో విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారట. ఇలా ఒకే ఏడాది ఓ బయోపిక్, ఇద్దరు పోరాట యోధుల కథలను అందించిన ఘనత ఆయనకి దక్కింది.
Vijayendra prasad : విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పాయింట్ సల్మాన్‌కి చెప్పారట.

RRR writer vijayendra prasad revealed top secret
ఈ నేపథ్యంలో మరిన్ని కథలను సిద్దం చేస్తున్నట్టు ఇటీవల విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అందులో ఒకటి ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే పాన్ ఇండియా సినిమాకి కథ కాగా మరొకటి గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమాకి సీక్వెల్ కథ కావడం విశేషం.
ఈ సినిమాను సల్మాన్ ఖాన్‌తో పాటు రాక్ లైన్ వెంకటేశ్ 90 కోట్లతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 900 కోట్లకి పైగా వసూళ్ళు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కథ సిద్దం చేస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పాయింట్ సల్మాన్‌కి చెప్పినట్టు ఆయన నచ్చి పూర్తి స్థాయిలో కథ సిద్దం చేయమని అన్నట్టు చెప్పుకొచ్చారు.