Sai Dharam Tej Virupaksha Movie : ఏంటి అన్ని కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందా .. విడుదల కి ముందే విరూపాక్ష లెక్కలు !
Sai Dharam Tej Virupaksha Movie : మెగా కాంపౌండ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ డౌన్ అయింది అన్న టాక్ ఇటీవల గట్టిగా నడిచింది. అందువల్లే “రిపబ్లిక్” సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్లు రాలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా “విరూపాక్ష” ఏప్రిల్ 21వ తారీకు విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వకముందే కొన్ని కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చి సాయి ధరంతేజ్ కెరియర్ లో సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది.
పూర్తి లెక్కల్లోకి వెళితే సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రు. 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ సినిమా ఏపీ తెలంగాణ థియేటర్ హక్కులను రు. 22 కోట్లకు అమ్మడం జరిగింది. ఈ హక్కులను హోల్‌సేల్‌గా వెస్ట్ గోదావరి ప్రవీణ్ కు అమ్మేశారు. ఇక నాన్ థియేటర్ హక్కుల రూపంలో మరో రు. 28 కోట్ల ఆదాయం వచ్చింది. నాన్ థియేటర్ ఇతర హక్కులు ఉండనే ఉన్నాయి. ఇలా మొత్తం ఖర్చులు పోను ఆరు నుంచి ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు లాభం మిగిలింది. ఈ లాభాన్ని నిర్మాత భోగవల్లి ప్రసాద్ తో పాటు హీరో సాయిధరమ్ తేజ్,
సమర్పకుడు సుకుమార్ పంచుకుంటారు. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొంత ప్రాఫిట్ పై.. రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రకంగా సినిమా విడుదల అవ్వకముందే విరూపక్ష 50 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో చాలామంది ఏంటి అన్ని కోట్లు విడుదలకు ముందే వచ్చాయా అంటూ.. సినిమా ప్రేమికులు నోరేళ్ల పెడుతున్నారు. ఎలాగైనా సాయిధరమ్ తేజ్ కి విరూపాక్ష రూపంలో మంచి విజయం అందాలని కోరుకుంటున్నారు.