Virupaksha Movie : విరూపాక్ష సినిమా ఇంకా చూడలేదా మీరు ? ఈ న్యూస్ చదివితే వెంటనే టికెట్స్ బుక్ చేసుకుంటారు !
Virupaksha Movie : సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ విరూపాక్ష ‘ సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ ఖాతాలోకి వెళ్లడం విశేషం. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు. సుకుమార్ దగ్గర శిష్యులుగా పనిచేసిన ప్రతి డైరెక్టర్ సూపర్ హిట్లతో దూసుకెళుతున్నారు. […]
Virupaksha Movie : సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ విరూపాక్ష ‘ సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. అయితే ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ ఖాతాలోకి వెళ్లడం విశేషం. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు. సుకుమార్ దగ్గర శిష్యులుగా పనిచేసిన ప్రతి డైరెక్టర్ సూపర్ హిట్లతో దూసుకెళుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను పెట్టిఉప్పెన సినిమా చేశాడు. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఇటీవల నాని నటించిన ‘ దసరా ‘ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాను దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల కూడా సుకుమార్ శిష్యుడే. ఆయన సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు పనిచేశాడు. ఇప్పుడు డైరెక్టర్ గా మారి దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే మరో డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ‘ కరెంట్ ‘ సినిమాతో డైరెక్టర్ గా మారాడు.
అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘ కుమారి 21ఎఫ్ ‘ ఇటీవల నిఖిల్ నటించిన ‘ 18 పేజీస్ ‘ సినిమా సూపర్ హిట్ అయినవే. ఆయన కూడా సుకుమార్ దగ్గర పని చేసిన వాడే. ఇక బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఆర్య సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వాడే. తాజాగా ‘ విరూపాక్ష ‘ సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. ఈ డైరెక్టర్లంతా ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ లు కొడుతున్నారు. ఏ హీరో అయినా సుకుమార్ శిష్యరికంలో వచ్చిన డైరెక్టర్ అయితే కళ్ళు మూసుకొని సినిమా ఓకే చేయవచ్చు అని భావన కలిగించారు.