Ram Charan : సల్మాన్ ఖాన్ సపోర్ట్ ఉన్నా బాలీవుడ్‌లో సత్తా చాటగలడా..?

Authored By vamana sai | The Telugu News | Published on: June 17, 2022, 4:30 pm

Ram Charan : మెగా ఫ్యామిలీ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంకా చెప్పాలంటే తన తండ్రి, బాబాయ్‌ల కంటే ముందే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. మెగాస్టార్ గానీ, పవర్ స్టార్ గానీ, సాధించనంత త్వరగా అంటే కేవలం 2వ సినిమాతోనే స్టార్ డం ని సాధించాడు చరణ్. ఇక తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలానికే బాలీవుడ్‌లో కూడా చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అదే తుఫాన్.

తెలుగులో ఈ పేరుతో హిందీలో జంజీర్ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమాగా నమొదైంది. మళ్ళీ ఇప్పటివరకు చరణ్ హిందీ సినిమా చేయాలనే సాహసం చేయలేదు. ఇక ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ చరణ్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చింది. అందుకే మళ్ళీ మెగాస్టార్ చరణ్‌ను బాలీవుడ్ మార్కెట్‌పై సత్తా చాటేందుకు అక్కడ హిందీ సినీఅను ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారట.సల్మాన్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రను చేస్తున్నారు.

Salman Khan in support to Ram Charan

Salman Khan in support to Ram Charan

Ram Charan : సల్మాన్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.

అలాగే, ఆయన నటిస్తున్న సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రను చేస్తున్నారు. ఇలా మన టాలీవుడ్ హీరోలతో మంచి బంధం ఏర్పరుచుకున్న సల్మాన్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగానే ఈసారి హిందీలో చరణ్‌తో సాలీడ్ మూవీకి సల్లుభాయ్ ప్లాన్ చేస్తున్నారట. మరి అదెలా ఉంటుందో..ఈ సినిమాకు దర్శకుడెవరో మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. కాగా, చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా ఇది రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు చెర్రీ.

vamana sai

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp