Samantha : మెగా హీరోని కాదని, ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న సమంత.. మైండ్ దొబ్బిందా అంటున్న నెటిజన్స్
ప్రధానాంశాలు:
Samantha : మెగా హీరోని కాదని, ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న సమంత.. మైండ్ దొబ్బిందా అంటున్న నెటిజన్స్
Samantha : సమంత ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఏదో ఒక విషయంతో ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారుతుంది. ఎప్పుడైతే నాగ చైతన్యకి విడాకులు ఇచ్చిందో అప్పటి నుండి సమంత పేరు వార్తలలో నిలుస్తూనే ఉంది. చైతూకి విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి రావడం, సినిమాలకి బ్రేక్ ఇవ్వడం, ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేయడం ఇలా పలు విషయాలతో వార్తలలో నిలుస్తుంది సమంత.అయితే మయోసైటిస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత తిరిగి తన ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడుతుంది. సినిమాలు, యాడ్స్, వెబ్ సిరీస్ ఇలా తనకు నచ్చిన ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉంటుంది సమంత. అయితే సమంత రణ్వీర్ సింగ్‌తో కలిసి రీసెంట్‌గా ఒక యాడ్ చేసింది.

Samantha : మెగా హీరోని కాదని, ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న సమంత.. మైండ్ దొబ్బిందా అంటున్న నెటిజన్స్
Samantha సమంతపై గుస్సా..
పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కోసం యాడ్‍లో సమంత, రణ్‍వీర్ సింగ్ కలిసి నటించారు. భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పూజర కూడా ఈ యాడ్‍లో కనిపించారు. ఐపీఎల్ థీమ్‍తో ఆ నయా యాడ్ ఉంది. యాడ్‌లో చూస్తే ఐపీఎల్ వేలం జరుగుతుంటే.. పుజారాను కూడా ఆడిస్తామంటూ రణ్‍వీర్ సింగ్, సమంత వీడియో కాల్ చేసినట్టు ఈ యాడ్ మొదలవుతుంది. అయితే వారి మాటలు విని పుజారా ఆశ్చర్యపోగా “నువ్వు కొట్టిన నాలుగు సిక్సర్లపై ఒట్టు” అని సమంత అని అంటుంది. ఆ తర్వాత ఆటలో కాదని.. తనకు తినిపిస్తానని రణ్‍వీర్ సింగ్ అంటారు. ఆ తర్వాత రణ్‍వీర్, సమంత, పుజార ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్టు యాడ్ ముగుస్తుంది.

Samantha : మెగా హీరోని కాదని, ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న సమంత.. మైండ్ దొబ్బిందా అంటున్న నెటిజన్స్
ఐపీఎల్ సీజన్ హవా నడుస్తుంది కాబట్టి ట్రెండ్‍కు తగ్గట్టు ఈ యాడ్ తీసుకొచ్చింది జొమాటో. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సదరు కంపెనీ యాడ్ కోసం రామ్ చరణ్, రణ్‌వీర్ సింగ్‌లని అనుకుందట. ఈ యాడ్‌లో ఇద్దరిలో ఎవరితో నటిస్తావు అని అనగా సమంత రణ్‌వీర్‌తోనే చేస్తానని చెప్పిందట. దాంతో మెగా ఫ్యాన్స్ సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు ఈ మధ్య ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, రణ్‌వీర్ సింగ్‌తో అంత క్లోజ్‌నెస్ ఎందుకు అని తిట్టి పోస్తున్నారు. ఇక సమంత చివరిగా ఖుషీలో కనిపించగా, త్వరలోనే మళ్లీ సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.