Samantha Naga Chaitanya Divorce Official : మేం ఇద్దరం భార్యభర్తలుగా విడిపోతోన్నాం.. నాగ చైతన్య, సమంత అధికారిక ప్రకటన
Samantha naga chaitanya Divorce Official సమంత నాగ చైతన్య విడిపోతోన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరోక్షంగా సమంత ఎన్నో ట్వీట్లు, పోస్ట్ చేసింది. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక చైతన్య కూడా మీడియా ముందు ఈ విషయాన్ని మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే సమయంలో ఒకే పోస్ట్‌ను ట్వీట్ చేశారు. విడిపోతోన్నట్టు ప్రకటించారు.
Samantha naga chaitanya Divorce Official మేం ఇద్దరం భార్యభర్తలుగా విడిపోతోన్నాం..
‘ఎన్నో సుధీర్ఘ చర్చలు, ఎన్నో పరిణామాల తరువాత మేం ఇద్దరం భార్యా భర్తలుగా ఉండకుండా విడిపోయి ఎవరి జీవితాలను వారే బతికేందుకు నిర్ణయించుకున్నాం. ఎవరి దారి వాళ్లే చూసుకుందామని నిర్ణయించుకున్నాం. గత దశాబ్దాలుగా ఉన్న స్నేహబంధం ఇలానే కొనసాగుంది.. అది ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉంటుంది.
ఈ కఠిన పరిస్థితులో మీ మద్దతు, మా వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని మా అభిమానులు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని అన్నారు.. దీంతో చైసామ్ విడాకుల రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. అయితే సమంత మాత్రం భరణంగా భారీ మొత్తంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వందల కోట్లు సమంతకు వచ్చినట్టు తెలుస్తోంది.