Trivikram : సాయంత్రం అయితే త్రివిక్రమ్ అక్కడే ఉంటాడట.. గుట్టు విప్పిన సునీల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Trivikram : సాయంత్రం అయితే త్రివిక్రమ్ అక్కడే ఉంటాడట.. గుట్టు విప్పిన సునీల్

Trivikram : టాలీవుడ్‌లో సునీల్ త్రివిక్రమ్ రిలేషన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇద్దరూ ఎంతటి ప్రాణ స్నేహితులో అందరికీ తెలిసిందే. ఒకే రూంలోఉంటూ కష్టాలు పడ్డ రోజులను ఇంకా తలుచుకుంటూ ఉంటారు. ఒకరేమో సినిమాలో నటించే ఆఫర్ల కోసం తిరుగుతుంటే.. ఇంకొకరేమో సినిమాలో రచన, డైరెక్షన్ ఆఫర్ల కోసం తిరిగేవారు. అలా ఇద్దరూ ఎన్నో ఏళ్లు రూంలో ఉంటూ పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరూ పంజాగుట్టలోని ఓ రూంలో రెంటుకు ఉండేవాళ్లు. సినిమాల్లోకి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 January 2022,8:30 pm

Trivikram : టాలీవుడ్‌లో సునీల్ త్రివిక్రమ్ రిలేషన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇద్దరూ ఎంతటి ప్రాణ స్నేహితులో అందరికీ తెలిసిందే. ఒకే రూంలోఉంటూ కష్టాలు పడ్డ రోజులను ఇంకా తలుచుకుంటూ ఉంటారు. ఒకరేమో సినిమాలో నటించే ఆఫర్ల కోసం తిరుగుతుంటే.. ఇంకొకరేమో సినిమాలో రచన, డైరెక్షన్ ఆఫర్ల కోసం తిరిగేవారు. అలా ఇద్దరూ ఎన్నో ఏళ్లు రూంలో ఉంటూ పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి.

ఈ ఇద్దరూ పంజాగుట్టలోని ఓ రూంలో రెంటుకు ఉండేవాళ్లు. సినిమాల్లోకి రాకముందు వీరు అక్కడే ఉండేవారు. అయితే ఇప్పటికీ ఆ రూంని అలానే ఉంచుకున్నారట. ఆ రూంని త్రివిక్రమ్ ఇంకా వాడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే వెళ్లి కాస్త హాయిగా విశ్రాంతి కూడా తీసుకుంటాడట. ఈ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. దీనికి కారణం నటుడు సంపత్ రాజ్.

Samapatha Raj On Sunil And Trivikram Secret

Samapatha Raj On Sunil And Trivikram Secret

Trivikram : త్రివిక్రమ్‌పై సంపత్ రాజ్..

సంపత్ రాజ్ దర్శకుడు త్రివిక్రమ్‌కు వార్నింగ్ ఇచ్చాడట. నెక్స్ట్ సినిమాలో చాన్స్ ఇవ్వకపోతే సెట్‌కి వచ్చికెమెరాలు ఎత్తుకు పోతానని అన్నాడట. అయితే తివిక్రమ్‌ను ఎలా పట్టుకోవాలో.. ఎఫ్ 3 సెట్‌లో సునీల్‌ను అడిగాడట సంపత్. నేను చెప్పానని చెప్పకండి.. రోజూ సాయంత్రం అయితే చాలు ఓ ఆఫీస్ ఉంటుంది.. అక్కడే ఉంటాడు వెళ్లండని చెప్పాడట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది