Sarkaru vari pata : సర్కారు వారి పాట.. నథింగ్ అంటున్న థమన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarkaru vari pata : సర్కారు వారి పాట.. నథింగ్ అంటున్న థమన్..!

 Authored By govind | The Telugu News | Updated on :12 April 2021,4:20 pm

Sarkaru vari pata : సర్కరు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న మహేష్ కెరీర్‌లో తెరకెక్కుతున్న 27వ సినిమా సర్కారు వారి పాట ఇప్పటికే దుబాయ్‌లో నెల రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

sarkaru vari pata is nothing says thaman

sarkaru-vari-pata-is nothing says thaman…!

కాగా సర్కారు వారి పాట చిత్ర బృందం ఆ తర్వాత గోవాలో అలాగే మళ్ళీ దుబాయ్‌లో షూటింగ్ ప్లాన్ చేశారట. దుబాయ్‌లోనే మరో నెల రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేసినప్పటికి కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా పెరుగుతుండటంతో సర్కారు వారి పాట బృందం దుబాయ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్టు తాజా సమాచారం. అయితే హైదరాబాద్‌లో వచ్చే వారం నుంచి 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట బృందం తాజాగా ఈ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేశారట. పరిస్థితులు చక్కబడితే సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారని లేటెస్ట్ అప్‌డేట్.

Sarkaru vari pata : ఏదేమైనా ఇప్పుడు థమన్ హవా నడుస్తోంది.

కాగా వరస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న థమన్ తాజాగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో మరో లెవల్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో థమన్ సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టాడు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయని… ఇప్పటికే మూడు పాటలు కంప్లీట్ చేశానని.. త్వరలో మరో రెండు పాటలను కంప్లీట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. సర్కార్ ఆల్బమ్ దాదాపుగా మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ తో ఉండబోతుందని తెలిపాడు. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా చాలా నెలలు ఉండగా ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో హింట్ ఇవ్వడం ఏంటన్న విషయంలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట. ఏదేమైనా ఇప్పుడు థమన్ హవా నడుస్తోంది. ఇక థమన్ ఇప్పటికే మహేష్ బాబుకి హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వగా సర్కారు వారి పాటతో కంపేర్ చేస్తే అవి నథింగ్ అంటున్నాడట.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది