Sarvanand : శర్వానంద్ మహా సముద్రం స్టోరీ లీక్ ..బ్లాక్ బస్టర్ పక్కా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarvanand : శర్వానంద్ మహా సముద్రం స్టోరీ లీక్ ..బ్లాక్ బస్టర్ పక్కా..?

 Authored By govind | The Telugu News | Updated on :23 February 2021,10:30 am

Sarvanand : శర్వానంద్ మహా సముద్రం అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. అదితిరావు హైదరీ, అనూ ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళి చివరికి శర్వానంద్ – సిద్దార్థ్ ల దగ్గర ఆగింది. ఎట్ట కేలకి ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సిద్దార్థ్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు.

sarvanand maha samudram leakblock buster hit

sarvanand maha samudram leak…block buster hit

కాగా తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతోంది. చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు. ఆ ద్వేషం కాస్త పెరిగి పెద్ద అయ్యాక పగగా మారుతుందని… ఇద్దరు బద్ద శతృవులుగా మారతారని తెలుస్తోంది. ఇక అజయ్ భూపతి మార్క్ రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని సమాచారం. భారీ యాక్షన్స్ సీన్స్ తో పాటు .. మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలాంటి కథ లు ఇప్పటికే చాలానే వచ్చినప్పటికి అజయ్ భూపతి కథ లో ఇచ్చిన ట్విస్టులు అదిరిపోతాయని సమాచారం.

Sarvanand : శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అన్న సినిమా చేస్తున్నాడు.

యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించే సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 19 న గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇక శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక గత కొన్నేళ్ళుగా తెలుగులో సిద్దార్థ్ కనిపించడం లేదు. బొమ్మరిల్లు స్థాయి హిట్ కోసం ట్రై చేసినప్పటికి వర్కౌట్ కాలేదు. చూడాలి మరి మహా సముద్రం సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా..!

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది