Sekhar Master : వారి చేతిలో మోసపోయిన శేఖర్ మాస్టర్.. కష్టపడ్డ సొమ్ము అంటూ ఆవేదన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sekhar Master : వారి చేతిలో మోసపోయిన శేఖర్ మాస్టర్.. కష్టపడ్డ సొమ్ము అంటూ ఆవేదన

Sekhar Master : శేఖర్ మాస్టర్ అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై శేఖర్ మాస్టర్ తన ముద్ర వేశాడు. ఢీ షోకు జడ్జ్‌గా, జబర్దస్త్ షోల్లో నవ్వులు పూయిస్తూ స్కిట్లు వేస్తూ ఆకట్టుకున్నాడు.అలా శేఖర్ మాస్టర్‌కు బుల్లితెర మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందరికీ తెలిసి వచ్చేలా చేసింది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఇక వెండితెరపై స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మాస్ సాంగ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,3:20 pm

Sekhar Master : శేఖర్ మాస్టర్ అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై శేఖర్ మాస్టర్ తన ముద్ర వేశాడు. ఢీ షోకు జడ్జ్‌గా, జబర్దస్త్ షోల్లో నవ్వులు పూయిస్తూ స్కిట్లు వేస్తూ ఆకట్టుకున్నాడు.అలా శేఖర్ మాస్టర్‌కు బుల్లితెర మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందరికీ తెలిసి వచ్చేలా చేసింది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఇక వెండితెరపై స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మాస్ సాంగ్ అయినా క్లాస్ సాంగ్ అయినా కూడా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తే అదిరిపోవాల్సిందే. అలా శేఖర్ మాస్టర్ అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బాగానే సంపాదించేస్తున్నాడు. అంతే కాకుండా శేఖర్ స్టూడియో అని పెట్టి.. యూట్యూబ్‌లో వీడియోలతో సంపాదిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్‌లను నిర్మిస్తున్నాడు.

ఇలా ఇంత కష్టపడి సంపాదిస్తున్న శేఖర్ మాస్టర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తాను మోసపోయిన తీరు, పోయిన డబ్బు గురించి చెబుతూ బాధపడ్డాడు. మరీ అంత దగ్గరి వాళ్లు కాదంటూ చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన వాళ్లే.. ఒకరిని పరిచయం చేశాడు. హైద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్‌లో ఉంది.. మంచి వ్యాల్యూ ఉంది.. ఇంకా వస్తుంది అని చెప్పారు. దీంతో నేను కూడా మన వాళ్లే కదా? అని ఇచ్చాను. బయటి నుంచి అప్పు తెచ్చి మరీ ఇచ్చాను. ఆ మధ్య లాక్డౌన్, కరోనా వచ్చాయి..

Sekhar Master Is Chaeted Money In Real Estate

Sekhar Master Is Chaeted Money In Real Estate

దాన్ని అమ్మేసి..కాస్త అప్పు తీర్చేద్దామని అనుకున్నాను.. అయితే ఇదే మాట వాళ్లకి చెప్పాను.. ఇప్పుడు కరోనా వల్ల రేట్ తగ్గిందండి అన్నారు. అయినా పర్లేదు ఎంత వస్తే అంతే ఇవ్వండి అని అన్నాను.. అలా ఆలస్యం చేస్తూనే వచ్చారు. ఇప్పటికీ రెండేళ్లు అవుతున్నాయి.. ఇప్పుడు వాళ్లు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. నేను కష్టపడ్డ సొమ్ము కదా? అండి.. తండ్రి సంపాదించి ఏమీ ఇవ్వలేదు.. నేను కష్టపడి అక్కడా ఇక్కడా అప్పు చేసి తెచ్చాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అలా పోయిందంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది