Sekhar master: మల్లెమాలతో గొడవ.. అందుకే శేఖర్ మాస్టర్ ‘ఢీ’ నుంచి తప్పుకున్నాడా..?
Sekhar master: దాదాపు 13 ఏళ్ళగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘ఢీ’ డాన్స్ షోకి దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఒక సీజన్ అయ్యే సరికి మరో సీజన్ రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ షోలో టీం లీడర్స్‌గా రష్మీ సుధీర్ హైపర్ ఆది దీపిక పిల్లి సందడి చేస్తున్నారు. ఇక ఇందులో చాలా కాలం నుంచి ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ ఓ జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా ఆయన ‘ఢీ’ షోలో కనిపించడం లేదు. గతంలో కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జడ్జెస్ గా వ్యవహరించి తప్పుకున్నారు.

sekhar-master- is out of D show
కానీ వారందరికంటే ఎక్కువగా ‘ఢీ’ షోలో కొనసాగిందంటే శేఖర్ మాస్టరే. షోలో ఆయన కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేసే విధానం, టీం లీడర్స్ మీద వేసే పంచులు.. తోటి జడ్జెస్ తో ఆయన చేసే సందడి అంతా ‘ఢీ’ షోకి బాగా ప్లస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ స్టార్ హీరోలకి సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉంటూనే ‘ఢీ’ షోలోనూ కొనసాగుతూ వచ్చారు. అయితే ఎందుకనో ఆయన ఉన్నట్టుండి షోలో కనిపించడం మానేశారు.
Sekhar master: అందుకే ‘ఢీ’ నుంచి శేఖర్ మాస్టర్ ని తప్పించారట.

shekhar master cry in star maa comedy stars show
ఆయన స్థానంలో మరో డాన్స్ మాస్టర్ వచ్చి చేరారు. అయితే మల్లెమాల వాళ్ళు శేఖర్ మాస్టర్ ను అర్థాంతరంగా తొలగించారనే టాక్ వినిపిస్తోంది. దాంతో అందరూ ఆయన యాంకర్స్ తో, జడ్జెస్ తో సరిగ్గా ప్రవర్తించడం లేదనే కారణంగా ఇలా తొలగించారని మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందట. శేఖర్ మాస్టర్స్ మల్లెమాల వారి రూల్స్ బ్రేక్ చేశాడట. అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ షో చేస్తున్నపుడు మరో ఛానెల్‌కు వెళ్లి అక్కడే షో చేయకూడదు. కానీ శేఖర్ మాస్టర్ మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వెళ్లాడు. దాంతో ‘ఢీ’ నుంచి తప్పించారట. ఒకవేళ అక్కడ మానేస్తే మళ్ళీ వచ్చి మల్లె మాల వారి ‘ఢీ’ షోకి రావచ్చని అంటున్నారు.

sekhar master about sreemukhi