ShahRukh Khan – Prabhas : అక్షరాలా 220 కోట్లు .. షారూఖ్ దెబ్బకి ప్రభాస్ కి వణుకు మొదలైంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ShahRukh Khan – Prabhas : అక్షరాలా 220 కోట్లు .. షారూఖ్ దెబ్బకి ప్రభాస్ కి వణుకు మొదలైంది !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 January 2023,8:00 pm

ShahRukh Khan – Prabhas : ఎన్నో ఆందోళనల మధ్య విడుదలైన పఠాన్ మూవీ రచ్చ రచ్చ చేస్తోంది. బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. మరోసారి పాత షారుఖ్ ఖాన్ ను జనాలు చూస్తున్నారు. అసలు కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ బాద్ షా బ్యాక్ అగేన్ అన్నట్టుగా ఉన్నాయి కలెక్షన్స్. సినిమా విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లను వసూలు చేసింది. కేవలం భారత్ లోనే తొలి రోజు రూ.70 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. తొలి రోజు రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఊచకోత కోసింది.

ShahRukh Khan Pathaan collections Crossed Prabhas movie collections

ShahRukh Khan Pathaan collections Crossed Prabhas movie collections

రెండో రోజు భారత్ లో అంచనాలకు అందకుండా రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే భారత్ లో 155 కోట్ల కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది పఠాన్. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ చూసుకుంటే ఏకంగా రూ.200 కోట్లు దాటాయి. రెండు రోజులకు రూ.220 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ మూవీ కూడా రెండు రోజుల్లో ఇన్ని కలెక్షన్స్ ను చేరుకోలేదు.

ShahRukh Khan Pathaan collections Crossed Prabhas movie collections

ShahRukh Khan Pathaan collections Crossed Prabhas movie collections

ShahRukh Khan – Prabhas : సల్మాన్ సుల్తాన్ మూవీ ఫస్ట్ వీకెండ్ లో రూ.210 కోట్లు వసూలు

ఇప్పటి వరకు సల్మాన్ మీద రికార్డు ఉండేది. ఆయన నటించిన సుల్తాన్ మూవీ వారం రోజులకు రూ.210 కోట్లు సాధించింది. ఆ రికార్డు ఇప్పటి వరకు అలాగే ఉంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆ మూవీ రికార్డ్ ను కేవలం రెండు రోజుల్లో తిరగరాసింది పఠాన్ మూవీ. సరికొత్త మార్జిన్ ను పఠాన్ క్రియేట్ చేసింది. ఇక వీకెండ్ లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది