భారత దేశ పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ సినిమా కోసం రంగంలోకి దిగబోతోంది .. అంత పెద్ద తోపు సినిమా నా అది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

భారత దేశ పోలీస్ వ్యవస్థ మొత్తం ఆ సినిమా కోసం రంగంలోకి దిగబోతోంది .. అంత పెద్ద తోపు సినిమా నా అది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 January 2023,9:40 pm

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ‘ పఠాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో దీపికా పదుకునే బికినీ షో పెద్ద దుమారం లేపింది. ఇప్పటికే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. పలు థియేటర్లలో పఠాన్ సినిమా యొక్క పోస్టర్స్ ను తొలగించడం,తగులబెట్టడం, కాలితో తన్నడం వంటివి చేశారు. ముఖ్యంగా ఈ సంఘటనలు గుజరాత్ లో ఎక్కువగా జరుగుతున్నాయి.

దీంతో గుజరాత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తారీకున రిలీజ్ కాబోతున్న పఠాన్ సినిమా థియేటర్ ల దగ్గర పోలీస్ లు ఉండాలని పేర్కొన్నారు. థియేటర్ దగ్గర ఎవరైనా గొడవ చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఓ సమావేశం లో మాట్లాడుతూ మంత్రుల నుంచి కార్యకర్తల దాకా అందరికీ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీ వారిని ఇబ్బంది పెట్టవద్దు అన్నట్లుగా మాట్లాడారు.

shahrukh khan Pathan movie release day full police security

shahrukh khan Pathan movie release day full police security

ప్రధాని సూచన మేరకు ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు పఠాన్ సినిమాపై గత కొన్నాళ్లుగా చేస్తున్న ఆందోళనను విరమించుకోవడం జరిగిందట. దేశవ్యాప్తంగా పఠాన్ సినిమా కు అనుకూలంగా ఉండే విధంగా చూస్తున్నారు. కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో సినిమా యూనిట్ సభ్యులు సినిమా థియేటర్లకు భద్రత కోరుతున్నారు. పఠాన్ సినిమాలో దీపిక పదుకునే బికినీ అందాలకు అడ్డు పడ్డ పోలీస్ లు మాత్రం థియేటర్ల వద్ద కాపు కాయనున్నరు. ఇక ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా తో షారుక్ ఖాన్ హిట్ కొడతాడా లేదో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది