shanmukh : షన్ను ఓటమిపై దీప్తి సునయన పోస్ట్.. పరోక్షంగా ఓటమిని అంగీకరించేసిన షన్ను ప్రియురాలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

shanmukh : షన్ను ఓటమిపై దీప్తి సునయన పోస్ట్.. పరోక్షంగా ఓటమిని అంగీకరించేసిన షన్ను ప్రియురాలు..!

shanmukh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ఎవరో తేలడానికి మరి కొద్ది గంటలే మిగిలి ఉంది. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసి పోగా… విన్నర్ గా ఎవరు నిలుస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రైవేటు అన్ అఫిషియల్ సైట్లన్ని ఇప్పటికే సన్నీ విన్నర్ అని ప్రకటించేశాయి. అయితే మొదటి నుంచి తమ ఫేవరేట్ కంటెస్టెంటే విజేతగా నిలుస్తాడని భావించిన షన్ను అభిమానులంతా… బయట జరుగుతోన్న పరిణామాలు చూసి ఇంకా షాక్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 December 2021,11:09 am

shanmukh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ఎవరో తేలడానికి మరి కొద్ది గంటలే మిగిలి ఉంది. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసి పోగా… విన్నర్ గా ఎవరు నిలుస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రైవేటు అన్ అఫిషియల్ సైట్లన్ని ఇప్పటికే సన్నీ విన్నర్ అని ప్రకటించేశాయి. అయితే మొదటి నుంచి తమ ఫేవరేట్ కంటెస్టెంటే విజేతగా నిలుస్తాడని భావించిన షన్ను అభిమానులంతా… బయట జరుగుతోన్న పరిణామాలు చూసి ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా షన్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన వేధాంత ధోరణిలో వేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరో కొద్ది గంటల్లో బిగ్ బాస్ షో ఫినాలే ప్రారంభం కానుండగా దీప్తి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇప్పటి వరకు షన్నుకి సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పిన దీప్తి…

shanmukh షన్ను ఓటమిని అంగీకరించినట్టేనా…?

ఇక మనశ్శాంతిగా ఉందమాని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగక.. వేదాంత ధోరణిలో ఇన్ డైరెక్ట్ గా మరో పోస్ట్ పెట్టింది. జీవితంలో జరిగే ప్రతీ ఒక్క దాని వెనక ఓ బలమైన కారణం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా దీప్తి చేసిన ఈ ఇన్ డైరెక్ట్ పోస్ట్ పై ఒక్కో అభిమాని ఒక్కొలా మాట్లాడుతున్నాడు. దీప్తీ షన్ను ఓటమిని ముందే అంగీకరించిందా..? ఆయన ఓటమి వెనక కూడా ఓ కారణం ఉందనేటట్టుగా పరోక్షంగా చెప్పేసిందా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే షన్ను కోసం మొదటి నుంచి దీప్తి పాటు పడుతూనే ఉంది. ప్రతీ క్షణం పోస్ట్‌లు చేస్తూ.. షన్నుకి చెడ్డ పేరు రాకుండా ప్రతీ విషయంలో జాగ్రత్త పడుతునే ఉంది.బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అవ్వగా.. ఈ సీజన్ లో మాత్రం అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి, షన్నుల బంధం గురించే.

deepthi sunaina in directly agreed shanmukh defeat in bigg boss 5 Telugu

deepthi sunaina in directly agreed shanmukh defeat in bigg boss 5 Telugu

shanmukh  : సిరితో బంధమే షన్నుకు డ్యామేజీనా..!

బిగ్ బాస్ కంటే ముందునుంచే స్నేహితులైన వీరు…హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు. ఒక పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేస్తుంటారు. ఓ వైపు ఇంటి సభ్యులు, మరోవైపు బయటి ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకున్నారు. సిరితో కలిసి షన్ను చేసిన చేష్టలు, బిగ్ బాస్ ఇంట్లో చేసిన రొమాన్స్, ప్రవర్తించిన తీరుకు ఆయన ఇమేజ్ డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పటివరకు ఉన్న టాక్ ప్రకారం.. షన్ను టాప్ 2లో ఉన్నట్టు కనిపిస్తోంది. సన్నీ విన్నర్, షన్ను రన్నర్ అని వార్తలు వస్తుండగా.. నేడు రాత్రి బిగ్ బాస్ టీం ప్రకటించే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది