Shanmukh Siri : బిగ్ బాస్ నుంచి సిరి ఔట్.. బయటకు వెళ్తూ ఏడుస్తూ షణ్ముక్‌కు టైట్ హగ్..

Advertisement

Shanmukh Siri : తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ‘సీజన్ ఫైవ్’ రసవత్తరంగా సాగుతోంది. చివరి దశకు చేరుకుంది ఈ షో. కాగా, ఈ వారం ఎలిమినేషన్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సిరిని ఇంటి నుంచి బయటకు పంపిచేస్తున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. సదరు ప్రోమో వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఉత్కంఠకు తెర వీడింది.

Advertisement

Shanmukh Siri : షాక్ అయి కన్నీరు గార్చిన సిరి..

Shanmukh siri eliminated from bigg boss 5 telugu
Shanmukh siri eliminated from bigg boss 5 telugu

ఎవరు ఎలిమినేట్ అవుతారో తమ అభిప్రాయం తెలపాలని బిగ్ బాస్ అడిగింది. షణ్ముక్ జస్వంత్, సిరి, శ్రీరామ్ , సన్నీ, మానస్‌లు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. సన్నీ షణ్ముక్ బయటకు వెళ్తాడనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. మానస్ సిరి వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలా ఒక్కొక్కరు తమ ఒపీనియన్ చెప్పారు. చివరకు ‘బిగ్ బాస్ ’ బిగ్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చేశాడు.

Advertisement

సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అనౌన్స్ చేసిన క్రమంలో సిరి.. ‘బిగ్ బాస్’ మీరు కామెడీ చేయడం లేదు కదా అని అంటుంది. అంతలోనే డోర్ ఓపెన్ కావడంతో సిరి.. తన బ్యాగ్ పట్టుకుని బయటకు వెళ్లిపోయింది. ఇక వెళ్లే ముందర ‘ఐ విల్ మిస్ యూ’ అని చెప్పి షణ్ముక్ జస్వంత్‌ను హగ్ చేసుకుంది. షణ్ముక్ సైతం అలా డోర్ వద్ద కూర్చొని తెగ బాధపడిపోయాడు.

Advertisement
Advertisement