Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, తొలి వారం బెజవాడ బేబక్క ఇంటిని వీడగా.. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన సెకండ్ కంటెస్టెంట్‌గా శేఖర్ నిలిచాడు. ఇంతకాలం తన పంచ్‌లు, జోక్స్‌తో నవ్వించిన భాషా వెళ్లిపోతుండటంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఈ వారం చివరి నుంచి లీస్ట్‌లో ఉన్న ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటికెళ్లాలి […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, తొలి వారం బెజవాడ బేబక్క ఇంటిని వీడగా.. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన సెకండ్ కంటెస్టెంట్‌గా శేఖర్ నిలిచాడు. ఇంతకాలం తన పంచ్‌లు, జోక్స్‌తో నవ్వించిన భాషా వెళ్లిపోతుండటంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఈ వారం చివరి నుంచి లీస్ట్‌లో ఉన్న ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటికెళ్లాలి అన్నది కంటెస్టెంట్సే డిసైడ్ చేస్తారని చెబుతారు నాగార్జున. ఆదిత్య ఓం, శేఖర్ భాషాలను నిలబెట్టి.. హౌస్‌లో ఉండాలని అనుకుంటున్న వ్యక్తి మెడలో పూలదండలు వేయాలని చెప్పారు.

Shekar Basha ఇది అస‌లు కార‌ణ‌మా?

మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. సీత మినహా మిగిలిన 10 మంది ఆదిత్య మెడలో దండేశారు. హౌస్‌మెట్స్ నిర్ణయం మేరకు శేఖర్ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున. అయితే ఈ నిర్ణ‌యం చాలా మందికి షాకింగ్‌గా మారింది. అస‌లు శేఖ‌ర్ భాషా ఎలిమినేట్ అవుతాడ‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. అయితే ఆయ‌న ఎలిమినేట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ని అంటున్నారు. శేఖర్​ బాషా హౌస్ నుంచి వెళ్లిపోవ‌డానికి గ‌ల ముఖ్య కార‌ణం త‌న భార్య డెలివరీ కావడమేనట. త‌న భార్య డెలివరీ కావ‌డం వ‌ల‌న హౌస్ నుంచి బ‌య‌టకు రావాల‌ని శేఖ‌ర్ భావించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆడియన్స్ వేసిన ఓట్లను పక్క‌న పెట్టి బిగ్ బాస్ నిర్ణ‌యంతో ఈ వారం ఎలిమినేష‌న్ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది.

Shekar Basha బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

మ‌రోవైపు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లన శేఖ‌ర్ బాషాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్​ ద‌క్కిన‌ట్లు తెలుస్తుంది. ఆయ‌న ఉన్న రెండు వారాల‌కు గాను వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని బిగ్ బాస్ నిర్వ‌హాకులు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.హౌస్‌లో నేను విలన్ అవ్వలేదని , హీరోగానే బయటికొచ్చానని చెబుతాడు. మణికంఠ తండ్రి చావు, తల్లి చావులను అడ్డం పెట్టుకుని గేమ్‌లో లాభం పొందాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు శేఖర్. నేను చెప్పిందే నడవాలనే మెంటాలిటి ఉందని , చిన్న దానిని పెద్దది చేసి అవతలి వాళ్ల క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయాలని అనుకుంటుందని ఓ షాకింగ్ న్యూస్ చెబుతాడు.. అయితే యష్మిని ఉద్దేశించే శేఖర్ భాషా ఆ మాటలు అన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది