Vishnu Priya : విష్ణు ప్రియ డ్రెస్ గురించి డిస్కషన్.. సోనియాకి నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్
vishnu priya : బిగ్ బాస్ సీజన్ 8 అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టిందని తాజా ఎపిసోడ్ లో చెప్పారు నాగార్జున. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ని సాధించి.. ఇండియాలోనే ఫస్ట్ సీజన్‌గా నిలిచిందని చెప్పారు నాగార్జున. ఇక ఈ సీజన్‌లో ముగ్గురు చీఫ్‌లు అనే చెత్త కాన్సెప్ట్‌ని పెట్టి.. సీజన్‌ని అట్టర్ ఫ్లాప్ వైపుగా నడిపిస్తున్న ముగ్గురు చీఫ్‌లకు క్లాస్‌లు పీకే పనిలో పడ్డారు. నాగార్జున చేతిలో ఉన్న గన్ చూసి.. భయం వేస్తుందని కంటెస్టెంట్స్ […]
ప్రధానాంశాలు:
vishnu priyaవిష్ణు ప్రియ డ్రెస్ గురించి డిస్కషన్.. సోనియాకి నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్
vishnu priya : బిగ్ బాస్ సీజన్ 8 అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టిందని తాజా ఎపిసోడ్ లో చెప్పారు నాగార్జున. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ని సాధించి.. ఇండియాలోనే ఫస్ట్ సీజన్‌గా నిలిచిందని చెప్పారు నాగార్జున. ఇక ఈ సీజన్‌లో ముగ్గురు చీఫ్‌లు అనే చెత్త కాన్సెప్ట్‌ని పెట్టి.. సీజన్‌ని అట్టర్ ఫ్లాప్ వైపుగా నడిపిస్తున్న ముగ్గురు చీఫ్‌లకు క్లాస్‌లు పీకే పనిలో పడ్డారు. నాగార్జున చేతిలో ఉన్న గన్ చూసి.. భయం వేస్తుందని కంటెస్టెంట్స్ అనడంతో.. ‘భయపడాల్సింది గన్‌కి కాదు.. తప్పు చేస్తే భయపడాలి’ అంటూ పంచ్ వేశారు నాగ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సంచాలక్‌గా ప్రేరణని తన సైకో చేష్టలతో కన్ఫ్యూజ్ చేసిందే యష్మీ గౌడ. కానీ.. ఆమె కన్ఫ్యూజ్ అయ్యిందని చెప్పి మరోసారి తన వంకరబుద్దిని బయటపెట్టుకుంది యష్మీ.
Vishnu Priya లెఫ్ట్ అండ్ రైట్..
తను కన్ఫ్యూజ్ అయ్యిందా లేదంటే.. నువ్వు కన్ఫ్యూజ్ చేశావా? అని కరెక్ట్ పాయింట్ అడిగితే.. లేదు సార్.. వేరే వాళ్లు కన్ఫ్యూజ్ చేశారు.. ఈమె కన్ఫ్యూజ్ అయ్యింది.. పక్క వాళ్లపై బురద వేసే ప్రయత్నం చేసింది యష్మీ. దాంతో నాగ్.. ఆ అమ్మాయి ఎంత అరిచినా కూడా ఎవరూ వినలేదు.. ఆమె సంచాలక్‌గా ఫెయిల్ అయ్యిందని నువ్వు చెప్తున్నావా? మరి నువ్వు సంచాలక్‌గా ఏం ఉద్దరించావ్. మణికంఠ, సీతల విషయంలో నువ్వు తప్పు చేయలేదా? అని అడిగారు నాగార్జున.అబ్బే ఏం లేదు సార్.. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది కరెక్ట్ అని చెప్పింది. దాంతో నాగార్జున.. 250 గ్రాముల విషయంలో నువ్వు చేసింది ఏంటి? అని అడిగితే.. నేను కరెక్టే చేశాను కానీ.. సంచాలక్ ప్రేరణ చేసింది తప్పు అని అన్నది. సరే ఆమె తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే.. నువ్వెందుకు డాన్స్ చేశావ్ అని అడిగారు నాగార్జున.
హౌస్‌లో కెమెరాలు ఉన్నాయి.. వీడియోలు వేస్తారు అనే భయం కూడా లేకుండా.. లేదు సార్.. అస్సలు నాతో ఆ విషయం మాట్లాడలేదు.. నన్ను అడగలేదు అని పచ్చి అబద్దాలు ఆడింది యష్మీ గౌడ. ఇక విష్ణు ప్రియ ఫ్యామిలీ గురించి సోనియా నోరు పారేసుున్న దాన్ని చూపించారు. ‘నిన్ను ఎవరూ పట్టించుకోరేమో విష్ణు ప్రియా.. కానీ మాకు ఫ్యామిలీ ఉంది.. మాకు పట్టించుకునే వాళ్లు ఉన్నారు.. ఏం చూపిస్తారో అనే ఒత్తిడి ఉంటుంది’ అని విష్ణు ప్రియ ఫ్యామిలీ గురించి వాగిన వాగుడుని చూపించారు. ఇంట్లో పట్టించుకునే వాళ్లు లేరా?? నువ్వు అలా మాట్లాడటం కరెక్టేనా? అని అడిగాను నాగ్. ఆ తరువాత విష్ణుని లేపి.. నీ ఫాదర్ మదర్ గురించి సోనియాకి తెలుసా? అని అడిగారు. దాంతో విష్ణు చెప్పాను సార్ అని అన్నది. దాంతో నాగార్జున.. ఆమె ఫ్యామిలీ గురించి తెలిసి కూడా.. ఆ మాట ఎలా అనగలిగావ్. నువ్వు అన్న మాటలో అర్థం ఏంటి? అని అడిగారు. ‘నేను అనాలని అనలేదు సార్.. గొడవని పెద్దది చేయాలని అనుకోలేదు.. కోపంలో వచ్చేసింది’ అని పిట్ట కథలు చెప్పబోయింది. నీ గురించి బయట ఎవరూ ఏమీ అనుకోకూడదు. విష్ణు గురించి మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్ అంటూ నాగ్ చాలానే సీరియస్ అయ్యాడు.