Shirish Bharadwaj : నా కొడుకుని చాలా బాధ పెట్టారు.. మ‌న‌వ‌రాల‌ని పంప‌మ‌న్న పంప‌లేదంటూ శ్రీజ మాజీ భ‌ర్త త‌ల్లి ఆవేద‌న‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shirish Bharadwaj : నా కొడుకుని చాలా బాధ పెట్టారు.. మ‌న‌వ‌రాల‌ని పంప‌మ‌న్న పంప‌లేదంటూ శ్రీజ మాజీ భ‌ర్త త‌ల్లి ఆవేద‌న‌

Shirish Bharadwaj : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మనస్పర్థల వల్ల శిరీష్ తో విడిపోయింది. తిరిగి తండ్రి దగ్గరకు చేరింది.అయితే ఇటీవలే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరగా ఆయన ఆరోగ్యం […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2024,6:00 pm

Shirish Bharadwaj : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే తనకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మనస్పర్థల వల్ల శిరీష్ తో విడిపోయింది. తిరిగి తండ్రి దగ్గరకు చేరింది.అయితే ఇటీవలే శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరగా ఆయన ఆరోగ్యం క్షీణించి మృతిచెందారు. వీరి ప్రేమకు గుర్తుకు ఓ పాప కూడా జన్మించింది. తనకు నివృత్తి అనే పేరు పెట్టారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత శ్రీజ, శిరీష్ విడాకులు తీసుకున్నారు.

Shirish Bharadwaj చాలా బాధ‌గా ఉంది..

శిరీష్ భరద్వాజ్ మృతి త‌ర్వాత ఆయ‌న‌కు సంబంధించి అనేక వార్త‌లు వ‌చ్చాయి. తాగుడుకు బానిసై మరణించినట్లు వస్తున్న వార్తలను శిరీష్ తల్లి ఖండించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విశేషాలను పంచుకున్నారు. అందరూ తాగుతున్నట్లుగా తాగేవాడే కానీ ఎప్పుడూ బాధతో ఎక్కువ తాగలేదని తెలిపింది. చనిపోవడానికి నెలరోజుల ముందు కూడా బాగానే ఉన్నాడని, లివర్, లంగ్స్ పాడవడంతో మరణించారని అందరూ అనుకుంటున్నారని, కానీ గుండెపోటుతో మృతిచెందినట్లు వెల్లడించింది. శిరీష్ కు తన కూతురు నివృతి అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ పాప శ్రీజ దగ్గరే ఉంటోందని, చూపించమని చాలాసార్లు అడిగినప్పటికీ చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ చూపించలేదని, వారంతా పెద్దవాళ్లు కదా అని వ్యాఖ్యానించింది.

Shirish Bharadwaj నా కొడుకుని చాలా బాధ పెట్టారు మ‌న‌వ‌రాల‌ని పంప‌మ‌న్న పంప‌లేదంటూ శ్రీజ మాజీ భ‌ర్త త‌ల్లి ఆవేద‌న‌

Shirish Bharadwaj : నా కొడుకుని చాలా బాధ పెట్టారు.. మ‌న‌వ‌రాల‌ని పంప‌మ‌న్న పంప‌లేదంటూ శ్రీజ మాజీ భ‌ర్త త‌ల్లి ఆవేద‌న‌

ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కూతురును చూడాలని ఉందని శిరీష్ అడిగాడని, తెలిసినవారితో మెగా ఫ్యామిలీని అడిగినప్పటికీ వాళ్లు పంపించలేదని తెలిపింది. దీంతో తన కొడుకు ఎంతో బాధపడ్డాడని, నివృతి అంటే తన కొడుకుకు ఎంతో ఇష్టమని, ఏ తండ్రి అయినా కూతురును దూరం చేసుకోవాలని అనుకోరని చెప్పింది.శ్రీజ, శిరీష్‌ విడిపోవడానికి సంబంధించిన ఆమె మాట్లాడుతూ, కారణాలు తెలియదని, అది గుర్తు లేదని, చాలా ఏళ్లు అయిపోయిందని తెలిపింది. శ్రీజపై ప్రశంసలు కురిపించింది. మంచి అమ్మాయని, చాలా ఇన్నోసెంట్‌ అని, బాగా ఉండేదని తెలిపింది. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు, తన మనవరాలిని మాత్రం చూడాలని ఉందనే కోరికని వెల్లడించింది శిరీష తల్లి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది