shivaji : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాకు మొదటి నుంచి తెలుసు .. శివాజీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

shivaji : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాకు మొదటి నుంచి తెలుసు .. శివాజీ

shivaji  : బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు. అయితే అందరూ శివాజీనే ఈ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ శివాజీ కాకుండా అతడి సలహాలు విని ఆట ఆడిన పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ విషయంపై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  shivaji : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాకు మొదటి నుంచి తెలుసు .. శివాజీ

shivaji  : బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు. అయితే అందరూ శివాజీనే ఈ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ శివాజీ కాకుండా అతడి సలహాలు విని ఆట ఆడిన పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ విషయంపై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులకి, తనకు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున కి, బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. శివాజీ ఇంకా మాట్లాడుతూ.. బిగ్బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని, నేను వాటిని నమ్మను కూడా అని అన్నారు.

బిగ్బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే విన్నర్ ను ప్రకటిస్తారు. అలాగే ప్రశాంత్ ని విన్నర్ గా అనౌన్స్ చేశారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షో మొదలైనప్పుడు నుంచి నేను ఒకటి అనుకున్నాను. ఇలాంటి ఒక కామన్ మ్యాన్ టైటిల్ గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. యావర్ కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కామన్ మ్యాన్ గానే వచ్చాడు. అందుకే మాకు స్నేహం కుదిరింది. అంతే తప్ప మాకు గేమ్ ప్లాన్స్ ఏమీ లేవు అని శివాజీ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ లో పాల్గొనడం ఒక మధురానుభూతి. బిగ్బాస్ అనేది ఒక పాఠశాల. ఇందులో గొడవలు కొట్టుకోవడం ఉంటాయి అనుకుంటారు కానీ అది ఏమీ ఉండదు. ఇది ఒక పాఠశాల. డిసిప్లిన్ చాలా అవసరం. మనకు లైఫ్ పాటలను నేర్పుతుంది. ఇదే మీకు చెప్పాలనుకున్నాను అని ఆయన అన్నారు.

ఈ షో సక్సెస్ అవ్వడంలో నాగార్జున ది ప్రధాన పాత్ర. అందులో నేను ఉండడం చాలా సంతోషం. ఇక నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అతడే గెలవాలి అనుకున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోడు. అలాగే తనకి మద్దతు పలికిన ప్రేక్షకులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే టైటిల్ విన్నర్ గెలిచిన ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుస్థాహంతో అమర్ దీప్, అశ్విని శ్రీ , గీతూ రాయల్ కారులపై దాడికి పాల్పడి అల్లరి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కూడా నాశనం అవడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక