Bigg Boss Telugu 7 : రెండో హౌస్‌మెట్‌గా శివాజీ కన్ఫమ్.. కొట్టేశాడుపో.. బిగ్ బాస్ ట్రోఫీ ఎవరికో ఫిక్స్ అయినట్టే ఇక
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లో రెండో హౌస్ మెట్ గా శివాజీ కన్ఫమ్ అయ్యాడు. అంతే కాదు.. రెండో పవరాస్త్రను కూడా గెలుచుకున్నాడు. మరో 4 వారాల ఇమ్యూనిటీని సాధించాడు శివాజీ. అంటే 6 వారాల వరకు శివాజీ సేఫ్ అన్నమాట. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో రెండో హౌస్ మెట్ గా వీఐపీ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాదు.. హోస్ట్ నాగార్జున కూడా మెచ్చుకున్నాడు. శివాజీ నీ ఆట సూపర్బ్. అదిరిపోయింది అన్నాడు. రణధీర టీమ్ ను లీడ్ చేయడం దగ్గర్నుంచి ఆ టీమ్ ను గెలిపించడం.. చివరకు పవరాస్త్ర టాస్క్ లోనూ బిగ్ బాస్ అంటూ అరిచే టాస్క్ లోనూ బాగా అరిచి రెండో హౌస్ మెట్ అయ్యాడు శివాజీ.
కాకపోతే తలుపు తీయిరా స్వామీ నేను వెళ్లిపోతా అంటూ శివాజీ చేసిన రచ్చకు మాత్రం నాగార్జున శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. మామూలుగా కాదు.. తలుపు తీయడం ఎంతసేపు. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపకూడదు అంటూ ధైర్యం చెబుతాడు బిగ్ బాస్. మొత్తం మీద 11 డెసిబుల్ పాయింట్స్ తో శివాజీ ముగ్గురిలో గెలుస్తాడు. అమర్ దీప్ కి మైనస్ పాయింట్స్ వస్తాయి. దానికి కారణం.. ఆయన మధ్యలో పాజ్ ఇవ్వడం. ఇక.. షకీలాకు 9 డెసిబుల్ పాయింట్స్ వస్తాయి. అలా.. ఎక్కువ పాయింట్లు తెచ్చుకొని శివాజీ టాప్ లో నిలుస్తాడు. ఆట సందీప్ తర్వాత రెండో హౌస్ మెట్ గా శివాజీ బిగ్ బాస్ హౌస్ లో స్థానం దక్కించుకున్నాడు.
Bigg Boss Telugu 7 : శివాజీనే బిగ్ బాస్ 7 విన్నరా?
అయితే.. ఇక్కడ శివాజీకి హోస్ట్ నాగార్జున నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. శివాజీ హౌస్ లో ఎంత రచ్చ చేసినా.. ఏదో మందలించి మందలించనట్టుగా మందలించాడు తప్పితే.. శివాజీని పెద్దగా ఏం అనలేదు నాగార్జున. మిగితా వాళ్లపై విరుచుకుపడిన నాగార్జున.. మిగితా కంటెస్టెంట్లపై సీరియస్ అయిన నాగార్జున శివాజీపై మాత్రం అంతగా సీరియస్ కాకపోవడానికి కారణం.. బిగ్ బాస్ 7 విన్నర్ గా శివాజీని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందే బిగ్ బాస్ యాజమాన్యం శివాజీని బిగ్ బాస్ 7 విన్నర్ గా డిసైడ్ చేసినట్టు టాక్. అందుకే శివాజీకి రెండో పవరాస్త్రను అందించారని.. మరో 4 వారాల వరకు శివాజీ సేఫ్. అలాగే.. నేను 15 వారాలు ఈ ఇంట్లో పక్కా ఉంటా.. 15 వారాల తర్వాతే ఇంటికి అంటూ శివాజీ కూడా హౌస్ లో ఒకసారి నోరుజారాడు. ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ ముందే విన్నర్ ను డిసైడ్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో?