Shivathmika Rajashekar : స్టేజిపై అందరూ చూస్తుండగానే ఎడ్చేసిన హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక.. వీడియో
Shivathmika Rajashekar : సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ అందరికీ సుపరిచితురాలే. రాజశేఖర్ మరియు జీవిత దంపతుల కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. శివాత్మిక దొరసాని అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడినా గాని సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తెలుగులో మాత్రమే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా శివాత్మికకి అవకాశాలు వస్తూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే తన కొత్త చిత్రం “పంచతంత్రం” మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శివాత్మిక మాట్లాడుతూ… సినిమా దర్శకుడు హర్ష తనకు కథ చెప్పిన విధానం ఎంతో నచ్చిందని పేర్కొంది. స్టోరీ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు స్పష్టం చేసింది. ఇక అఖిలేష్ కోసమే సినిమా చేసినట్లు ఆయనకు థాంక్స్ తెలియజేసింది. ఇక ఈ సినిమా చేయడానికి మరో కారణం ఉష. ఆమెకు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. లేక పాత్రలో ఈ సినిమాలో నటించడం జరిగింది.
ఈ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. నా కెరియర్ లో బ్రహ్మానందం ఇంకా స్వాతి రెడ్డి లాంటి గొప్ప నటులతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్ చేస్తున్న సమయంలో చాలామంది నాకు ఎంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లందరికీ నా థ్యాంక్స్. ఈ సినిమా కోసం అందరం కష్టపడి పని చేసాం. మా అందరికీ మంచి ఫలితం రావాలి అంటూ ఎమోషనల్ అయ్యి శివాత్మిక స్టేజిపై అందరూ చూస్తుండగానే కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హరీష్ శంకర్ తోపాటు జీవిత రాజశేఖర్, రాజశేఖర్, కలర్స్ స్వాతి రెడ్డి.. ఇంకా పలువురు హాజరయ్యారు. 9వ తారీకు “పంచతంత్రం” సినిమా విడుదల కానుంది.
