Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మీకెన్నడు తెలియని షాకింగ్ నిజాలు
Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు.. మాస్ బీట్స్‌కు కేరాఫ్ ఎవరంటే ‘దేవి శ్రీ’ అని చెబుతారు. సినిమాల్లో అద్భుతమైన ఐటం సాంగ్స్ ఇవ్వడం దేవి శ్రీకి వెన్నతో పెట్టిన విద్య.. దేవి శ్రీ బీట్స్‌కు చిన్న పిల్లలు సైతం ఎగిరి గంతేస్తుంటారు. దానికి బెస్ట్ ఉదా.. మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీలో ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’ సాంగ్.. తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ మూవీలోని ‘కెవ్వు కేక’ సాంగ్స్ వింటే ఫ్యాన్స్కు పూనకం వచ్చేస్తుంటుంది. ఇక దేవి శ్రీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామం. ఆయన 1979 ఆగస్టు 2న జన్మించారు. తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి, తల్లిపేరు శిరోమణి. దేవి శ్రీకి తమ్ముడు సాగర్, చెల్లి పద్మిని ఉన్నారు.
Devi Sri Prasad : దేవి శ్రీకి ఈ పేరు ఎలా వచ్చిందటే..
దేవి శ్రీ తండ్రి సత్యమూర్తి మంచి సినిమా రైటర్. చాలా సినిమాకు కథలు అందించాడు. అందులో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్-786’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్‌కు ఈ పేరు ఎలా వచ్చిందంటే.. ఆయన అమ్మమ్మ పేరులోని ‘దేవి’, తాతయ్య పేరులోని ‘ప్రసాద్’ను రెండింటిని కలిపి ‘దేవి శ్రీ ప్రసాద్’గా నామకరణం చేశారు. ఇక దేవికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. ఓ రోజు ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు దేవి శ్రీ ఇంటికి సినిమా విషయంలో రాగా, లోపల దేవి శ్రీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సౌండ్స్ విన్న నిర్మాత రాజు ఒక సందర్భం చెప్పి దానికి ‘ట్యూన్’ ఇవ్వమని కోరడంతో కేవలం 2 నిమిషాల్లోనే ఇవ్వడంతో నిర్మాత షాక్ అయ్యారట..
దీంతో తన బ్యానర్‌లో వచ్చిన ‘దేవి’ సినిమాకు దేవి శ్రీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఆ సినిమాతోనే పాటు అందులోని పాటలు కూడా మంచి తెచ్చుకోవడంతో దేవి శ్రీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ప్లస్ 2 చదివిన దేవి శ్రీ ప్రస్తుతం మ్యూజిక్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సైతం అందుకున్నారు.